Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫిఫా ప్రపంచ కప్2026: మెస్సిపై ఫిఫాకు అల్జీరియా ఫిర్యాదు

ఫిఫా ప్రపంచ కప్2026: మెస్సిపై ఫిఫాకు అల్జీరియా ఫిర్యాదు

స్పోర్ట్స్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్2026లో తొలి మ్యాచ్‌లో అల్జీరియాపై అర్టెంటీనా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సి హ్యట్రిక్ గోల్స్ కొట్టి..

రికార్డు సృష్టించాడు. తదుపరి మ్యాచ్‌లో గెలిచి నాకౌట్ బెర్తు కన్ఫర్మ్ చేసుకోవాలని ఉత్సాహంతో ఉన్న అర్జెంటీనా జట్టుకు ఊహించని షాక్ ఎదురైంది. రిఫరీ పూర్ అంపైరింగ్ కారణంగా తాము ఓడిపోయామంటూ అల్జీరియా ఫిఫాకు ఫిర్యాదు చేసింది. రాయిటర్స్ కథనం ప్రకారం...

మెస్సి మ్యాచ్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడని అల్జీరియా ఫిర్యాదులో పేర్కొంది. తమ జట్టు ఆటగాడిని ఉద్దేశపూర్వకంగా కిందపడేసినప్పటీకీ మెస్సికి రిఫరీ రెడ్ కార్డు జారీ చేయలేదని వెల్లడించింది. అసలు మ్యాచ్ సరైన రీతిలో జరగలేదంటూ, మ్యాచ్‌లో జరిగిన తప్పిదాలను ప్రత్యేకంగా చూపిస్తూ ఫిఫా రిఫరీయింగ్ కమిషన్‌కు లేఖను అందించింది. ఆట తొలి అర్ధ భాగంలో అర్జెంటీనా కెప్టెన్ మెస్సి ఉద్దేశపూర్వకంగా తమ కెప్టెన్ ఐస్సా మాండీ పిక్కపై కాలు వేసి.. అతడు పడిపోయేందుకు కారణమయ్యాడని అల్జీరియా తెలిపింది. అలానే వెనుక నుంచి మెస్సి తన బూటుతో మాండీని తన్నినట్లు కూడా తెలుస్తోందని, మెస్సిని మైదానం నుంచి బయటకు పంపాలని తాము డిమాండ్ చేసినా.. రిఫరీ సైమన్ మార్సినియాక్‌ అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అల్జీరియా పేర్కొంది.

రెండో అర్ధభాగంలో అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ అలెక్సిస్‌మాక్ అల్లిస్టర్ తమ జట్టు ఆటగాడు ఇబ్రహీం మజాపై మోచేతితో దాడి చేసినట్లు అల్జీరియా లేఖలో ఆరోపించింది. ఈ దాడి పట్ల కూడా రిఫరీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తమను షాక్‌కు గురి చేసిందని, మ్యాచ్ మొత్తంలో రిఫరీ అర్జెంటీనాకు సానుకూలంగా ఉన్నారని ఆరోపించింది. రిఫరీ తప్పిదాల వల్లే తమపై అర్జెంటీనా విజయం సాధించిందని, వెంటనే మెస్సీతో పాటు రిఫరీపై యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నామని అల్జీరియా ఫిర్యాదులో పేర్కొంది.

ఫిఫా ప్రపంచ కప్2026: మెస్సిపై ఫిఫాకు అల్జీరియా ఫిర్యాదు

ఫిఫా ప్రపంచ కప్‌ చరిత్రలో అరుదైన ఘటన...

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy