Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫిఫా ప్రపంచ కప్‌లో మెస్సి హ్యతకు కుట్ర.. వెలుగులోకి సంచలన విషయాలు!

ఫిఫా ప్రపంచ కప్‌లో మెస్సి హ్యతకు కుట్ర.. వెలుగులోకి సంచలన విషయాలు!

ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026లో అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సికి భద్రతా ముప్పు ఎదురైనట్లు ఓ నివేదిక వెల్లడించింది. స్పెయిన్‌కు చెందిన ఓ పత్రిక పలు షాకింగ్ విషయాలను ప్రచురించింది.

అందులో మెస్సి, అర్జెంటీనా జట్టు లక్ష్యంగా బాంబు బెదిరింపులు, ఆటగాళ్లను వెంబడించడం, ఆన్‌లైన్ వేధింపులు వంటి ఘటనలు జరిగినట్లు పేర్కొంది. మెస్సిని లక్ష్యంగా చేసుకుని ఓ వ్యక్తి తీవ్ర హెచ్చరిక చేసినట్లు నివేదికలో వెల్లడైంది. 'నేను నడుచుకుంటూ అట్లాంటా స్టేడియంలోకి వెళ్తా. నాలుగు బాంబులు నా శరీరానికి పెట్టుకుని వెళ్లి మెస్సిని పేల్చేస్తా' అని అతడు సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ బెదిరింపును భద్రతా సంస్థలు అత్యంత తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం.

ఇదే సమయంలో డల్లాస్ విమానాశ్రయానికి వచ్చిన ఓ ఫోన్ కాల్‌పైనా అధికారులు దర్యాప్తు చేసినట్లు నివేదిక తెలిపింది. తాము ముగ్గురం స్టేడియం వైపు వెళ్తున్నామని, తమ వద్ద నాటు బాంబులు, తుపాకీలు ఉన్నాయని కాల్ చేసిన వ్యక్తి చెప్పినట్లు పేర్కొంది. పోలీసులు, ఫుట్‌బాల్ ఆటగాళ్లే తమ లక్ష్యమని చెప్పడంతో భద్రతా సంస్థలు అప్రమత్తమైనట్లు సమాచారం. మెస్సితో పాటు పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో కూడా ప్రపంచకప్ సందర్భంగా భద్రతా ఆందోళనలను ఎదుర్కొన్నట్లు నివేదిక పేర్కొంది. జూన్ 14న రొనాల్డో బస చేసే ప్రదేశానికి సంబంధించిన వివరాలను ఓ అనుమానాస్పద వ్యక్తి తెలుసుకునేందుకు ప్రయత్నించినట్లు ఫిఫా ఉద్యోగి అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. టొరంటో, హ్యూస్టన్, మియామీలోనూ ఇలాంటి ఘటనలు నమోదైనట్లు పేర్కొంది.

మరోవైపు ఫ్రాన్స్‌కు చెందిన రిఫరీ ఫ్రాంకోయిస్ లెటెక్సియర్‌కు కూడా భారీగా బెదిరింపు సందేశాలు వచ్చినట్లు సమాచారం. టోర్నీ సమయంలో ఆయనకు వాట్సాప్‌లో దాదాపు 6 వేల బెదిరింపు సందేశాలు వచ్చినట్లు నివేదికలో వెల్లడైంది. ప్రపంచకప్ సందర్భంగా ఆటగాళ్లు, రిఫరీలు, ఇతర అధికారుల భద్రత కోసం ఎఫ్‌బీఐ, అంతర్జాతీయ పోలీసు సహకార సంస్థ ఆధ్వర్యంలో సంయుక్త భద్రతా వ్యవస్థ పనిచేసినట్లు సమాచారం.

strong>

స్థలం గిఫ్ట్‌గా ఇస్తే బాగుంటుంది.. ఉత్తరాఖండ్ సీఎంను ట్యాగ్ చేసి పంత్ ట్వీట్

ధోని, కోహ్లీ కాదు.. అత్యుత్తమ భారత క్రికెటర్ ఎవరంటే?: రహానె

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy