Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గుంటూరులో విషాదం.. కారులో మంటలు.. వ్యక్తి సజీవ దహనం

గుంటూరులో విషాదం.. కారులో మంటలు.. వ్యక్తి సజీవ దహనం

గుంటూరు, సెప్టెంబర్ 29: జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. సంగడిగుంట ప్రాంతంలో ఆసుపత్రికి వెళ్లి తిరిగి వస్తున్న తండ్రి, కుమారుడు ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

క్షణాల్లో మంటలు కారును పూర్తిగా చుట్టుముట్టడంతో తండ్రి తాడికొండ హరికృష్ణ కారులోనే చిక్కుకుని సజీవ దహనమయ్యారు. ఆయన కుమారుడు అఖిలేష్‌ ఈ ప్రమాదంలో గాయపడ్డాడు.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. కారులో సాంకేతిక లోపం కారణంగా మంటలు చెలరేగాయా.. మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన అఖిలేష్‌కు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ఈ వార్తలూ చదవండి

గోల్ఫ్ బంతులు మింగేసిన పాము.. కాపాడిన వైద్యులు.. వీడియో వైరల్

కొండచిలువలను వేటాడే రోబో కుందేళ్లు.. ఫ్లోరిడాలో కొత్త టెక్నాలజీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy