Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్‌లో రెండు రోజుల్లోనే 129 మంది మందుబాబులపై కేసులు

హైదరాబాద్‌లో రెండు రోజుల్లోనే 129 మంది మందుబాబులపై కేసులు

హైదరాబాద్, సెప్టెంబర్ 20: నగరంలో ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా.. రెండు రోజుల్లోనే 129 మందిని అరెస్ట్ చేశారు.


మొత్తం129 మందిలో 101 మంది ద్విచక్ర వాహనదారులు కాగా..

10 మంది ఆటోడ్రైవర్లు, 18 మంది కారు డ్రైవర్లు, ఇతర వాహనాల డ్రైవర్లు ఉన్నారు. వీరిలో ముగ్గురికి బీఏసీ పాయింట్లు 300కు పైగా నమోదైందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ.. ఎవరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదని పోలీసులు తెలిపారు. మద్యం తాగి డ్రైవింగ్ చేయవద్దని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.

ఈ వార్తలు కూడా చదవండి

కరీంనగర్ జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు.. రెండు ఎస్బీఐ ఏటీఎంల చోరీ..

హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్.. మూడేళ్ల బాలుడి మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy