హైదరాబాద్: హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో సంతమ్మ గార్డెన్స్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు రహదారి విస్తరణ పనుల్లో భాగంగా విద్యుత్ స్తంభాలను టవర్లకు మార్చేందుకు 33 కేవీ డీసీఓహెచ్ లైన్‌లో 10 స్పాన్ల స్టింగింగ్ పనులు చేపడుతున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు.
దీంతో బుధవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు బోడుప్పల్ 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్ ఫీడర్‌లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు డీసీ ఎన్.వేణుగోపాల్ తెలిపారు.
సాయిరాం కాలనీ, శ్రీనివాస కాలనీ, బృందావన్ కాలనీ, ఆనంద్‌నగర్, ఎస్సీ కాలనీ, బొమ్మక్ బ్రదర్స్ కాలనీ, ఈస్ట్ హనుమాన్‌నగర్, వెస్ట్ హనుమాన్‌నగర్, సన్నీ బకారీ మెయిన్ రోడ్డు, సాయిభవానీనగర్, సాయిదుర్గానగర్, బయన్నగూడ, గణేష్ నగర్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ నుంచి అంబేడ్కర్ విగ్రహం ప్రధాన రోడ్డు వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని చిలకానగర్ ఏఈ వినయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:

