హైదరాబాద్, మే 20 (ఆంధ్రజ్యోతి): బీజేపీ కార్యకర్తల కమిట్‌మెంట్, క్రమశిక్షణపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ కార్యకర్తలు సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తారని స్పష్టం చేశారు. బీజేపీలో పనిచేసే ప్రతి కార్యకర్త శిక్షణ తీసుకుని పనిచేస్తారని తెలిపారు. కమిట్‌మెంట్‌తో పార్టీ కోసం అంకితభావంతో కష్టపడతారని చెప్పుకొచ్చారు.
నేను కమిట్‌మెంట్ ఉన్న కార్యకర్తను..
ఈరోజు (బుధవారం) హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. చనిపోయిన తర్వాత కూడా బీజేపీ జెండా కప్పాలని కోరుకునే కార్యకర్తలు తమ పార్టీలో ఉన్నారని పేర్కొన్నారు. తాను కూడా కమిట్‌మెంట్ ఉన్న కార్యకర్తనని చెప్పుకొచ్చారు. తన కన్న కొడుకుని కూడా విచారణకు సహకరించాలని స్వయంగా పోలీసులకు అప్పగించానని ప్రస్తావించారు. చట్టం ముందు అందరూ సమానమనే భావనతోనే వ్యవహరించానని తెలిపారు. కొత్త పార్టీ వస్తుందనేది తప్పుడు ప్రచారమని స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్తలు సిద్ధాంతాల కోసం పనిచేస్తారని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని తేల్చిచెప్పారు. తమ పార్టీని బలోపేతం చేయడంలో ప్రతి కార్యకర్త పాత్ర కీలకమని కొనియాడారు.
కుటుంబ పాలనను తిరస్కరించారు..
ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఫామ్‌హౌస్‌లో కూర్చొని కేసీఆర్ ఏమైనా మాట్లాడొచ్చని.. కానీ తెలంగాణ ప్రజలు కుటుంబ పాలనను తిరస్కరించారని విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ అవినీతి, కుటుంబ పాలనను తామే అంతం చేశామని అన్నారు. ఆయన కుటుంబ పాలన, గడీల రాజకీయాలను బద్దలు కొట్టామని చెప్పుకొచ్చారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు బీజేపీ నిరంతరం పోరాడుతోందని బండి సంజయ్ స్పష్టం చేశారు.
.
కేసీఆర్ హయాంలో ఆ ప్రాజెక్టుకు భూసేకరణ లేకుండానే టెండర్లు పిలిచారు.. మంత్రి ధ్వజం
టీజీ పీజీఈసెట్ పరీక్ష షెడ్యూల్ మార్పు.. కొత్త తేదీ ఇదే
అక్రమాస్తుల కేసులో జలమండలి జనరల్ మేనేజర్ అరెస్ట్
Read Latest Telangana News And AP News And International News And Telugu News

