Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
క్లోజింగ్‌ ఆక్షన్‌ సెషన్‌లో కుదేలు

క్లోజింగ్‌ ఆక్షన్‌ సెషన్‌లో కుదేలు

సెన్సెక్స్‌ 539 పాయింట్లు పతనం

ముంబై: రోజంతా స్వల్ప నష్టాల్లో కొనసాగిన ప్రామాణిక ఈక్విటీ సూచీలు.. క్లోజింగ్‌ ఆక్షన్‌ సెషన్‌ (సీఏఎస్)లో ఒక్కసారిగా కుదేలయ్యాయి.

గురువారం సెన్సెక్స్‌ ఏకంగా 539.35 పాయింట్లు పతనమై 76,933.59 వద్దకు జారుకుంది. నిఫ్టీ 116.90 పాయింట్లు క్షీణించి 24,090.85 వద్దకు పడిపోయింది. మార్కెట్‌ దిగ్గజాలైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లలో ఇన్వెస్టర్లు 15 నిమిషాల సీఏఎస్‌ సెషన్‌లో ఆకస్మిక అమ్మకాలకు పాల్పడటం ఇందుకు కారణమైంది. సెన్సెక్స్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు 2.08 శాతం క్షీణించి సూచీ టాప్‌ లూజర్‌గా మిగిలింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 1 శాతం నష్టపోయింది. ఫ్యూచర్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌ అండ్‌ ఓ)లో భాగమైన కంపెనీల షేర్ల ముగింపు ధరను వేలం ద్వారా నిర్ణయించేందుకు సెబీ ఈ నెల 3 నుంచి సీఏఎస్‌ను ప్రవేశపెట్టింది. అయితే, సీఏఎస్‌ అమల్లోకి వచ్చాక తొలి మంత్లీ డెరివేటివ్‌ ఎక్స్‌పైరీ రోజున సూచీలు భారీ కుదుపునకు లోనవడం గమనార్హం.

ఈ వార్తలనూ చదవండి:

నౌమెడ్‌కు మూడేళ్ల ఓటీసీ కాంట్రాక్టు
హెచ్‌-1బీ వీసాలపై ఆధారపడటం తగ్గింది..
Read Latest AP News And Telangana News And International News And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy