Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహిళల టీ20 ప్రపంచ కప్: స్మృతి మంధానకు ప్రత్యేక గుర్తింపు

మహిళల టీ20 ప్రపంచ కప్: స్మృతి మంధానకు ప్రత్యేక గుర్తింపు

ఇంటర్నెట్ డెస్క్: మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భారత జట్టు ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయిన సంగతి తెలిసిందే. దీంతో లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.

అయితే టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన వ్యక్తిగత ప్రదర్శనకు మాత్రం ఐసీసీ గుర్తింపు లభించింది. 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డు కోసం ప్రకటించిన నలుగురు ప్లేయర్ల జాబితాలో స్మృతి చోటు దక్కించుకుంది.

ఈ అవార్డు కోసం ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీ, ఇంగ్లండ్ ఓపెనర్ డానీ వ్యాట్, దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ మారిజెన్ కాప్‌తో పాటు స్మృతి మంధాన పోటీలో నిలిచింది. ఫైనలిస్టులైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ నుంచి ఇద్దరు ప్లేయర్లు ఎంపిక కాగా.. టైటిల్ పోరుకు చేరుకోలేని భారత్, దక్షిణాఫ్రికా నుంచి మంధాన, కాప్‌లకు చోటు కల్పించారు. ప్రపంచ కప్ టోర్నీలో మంధాన 205 పరుగులు చేసి భారత్ తరఫున అత్యుత్తమ బ్యాటర్‌గా నిలిచింది. పాకిస్థాన్, నెదర్లాండ్స్‌పై వరుస అర్ధసెంచరీలు సాధించింది. ఆస్ట్రేలియాతో కీలక పోరులోనూ 38 పరుగులు చేసినా.. భారత జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయింది.

ఆస్ట్రేలియా తరఫున ఎలీస్ పెర్రీ మరోసారి తన ఆల్‌రౌండ్ ప్రతిభను చాటింది. టోర్నీలో 46.25 సగటుతో 185 పరుగులు చేయడంతో పాటు నాలుగు వికెట్లు తీసి జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించింది. మూడు మ్యాచ్‌ల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకుంది. ఇంగ్లండ్ ఓపెనర్ డానీ వ్యాట్ ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచింది. 73.50 సగటుతో 294 పరుగులు చేసిన ఆమె.. శ్రీలంకపై సెంచరీతో పాటు మరో రెండు అర్ధసెంచరీలు బాది ఇంగ్లండ్‌ను ఫైనల్‌కు చేర్చింది. దక్షిణాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ మారిజెన్ కాప్ బ్యాట్, బంతితో సమానంగా రాణించింది. 124 పరుగులు చేయడంతో పాటు ఎనిమిది వికెట్లు తీసి తన జట్టును సెమీఫైనల్ వరకు తీసుకెళ్లింది. ముఖ్యంగా భారత్‌పై అజేయంగా 81 పరుగులు చేసి, రెండు వికెట్లు పడగొట్టి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆదివారం లార్డ్స్ వేదికగా జరిగే ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ విజేతను ఐసీసీ ప్రకటించనుంది.


అందరికీ రుణపడి ఉంటా.. అరంగేట్రం తర్వాత వైభవ్ ఎమోషనల్ పోస్ట్

ఫిఫా ప్రపంచ కప్‌లో వివాదం.. ఎంబాపెపై బంతిని విసిరిన పరాగ్వే ప్లేయర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy