Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మేం రాలేం.. కావాలంటే క్యాబ్‌ బుక్‌ చేస్తాం!

మేం రాలేం.. కావాలంటే క్యాబ్‌ బుక్‌ చేస్తాం!

  • ఇంటి వద్ద దింపండని.. పోలీసులకు అర్ధర్రాతి యువతి ఫోన్‌

  • క్యాబ్‌ బుక్‌ చేసి ఫాలోఅప్‌ చేస్తామన్న పెట్రోలింగ్‌ పోలీసులు

  • ఖాకీల తీరుపై అసహనం..

  • వైరల్‌గా మారిన యువతి వీడియో

హైదరాబాద్‌సిటీ: లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో అర్ధరాత్రి దాటిన తర్వాత ట్రైన్‌ దిగిన ఓ యువతి.. తనను ఇంటి వద్ద దింపిరావాలంటూ పోలీసులకు ఫోన్‌ చేసింది. అయితే, 'ఇంటి వరకు రావడానికి కుదరదు. కావాలంటే క్యాబ్‌ బుక్‌ చేస్తాం.. సేఫ్‌గా ఇంటికి వెళ్లేంత వరకు ఫాలోఅప్‌ చేస్తాం' అంటూ పోలీసులు చెప్పడంతో ఆమె నిర్ఘాంతపోయింది. సహాయం కోసం పోలీసులకు ఫోన్‌ చేస్తే.. ఇంటి వరకు రాలేమని చెప్పడం చాలా బాధగా అనిపించిందంటూ ఒక వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది.

ఆ వీడియో మంగళవారం వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన ఓ యువతి ఈనెల 6న విజయవాడ నుంచి లింగంపల్లికి ఇంటర్‌సిటీ రైలులో వచ్చింది. అర్థరాత్రి 1.45 కావడంతో క్యాబ్‌లో ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ నానక్‌రామ్‌గూడ వెళ్లాలంటే భయం వేసి సహాయం కోసం డయల్‌-100కు ఫోన్‌ చేసింది. తనను పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనంలో దిగబెట్టాలని కోరింది. అర్ధరాత్రి 12గంటల నుంచి 4 గంటల మధ్య అన్‌సేఫ్‏గా ఫీలైతే పోలీసులకు తెలపాలని, వారు వచ్చి డ్రాప్‌ చేస్తారనే ఓ సర్క్యులర్‌ను గతంలో చూశానని,

దాని ప్రకారం పోలీసులకు ఫోన్‌ చేస్తే వారు క్యాబ్‌ బుక్‌ చేస్తామని, ఇంటి వరకు సేఫ్‌గా వెళ్లే వరకు ఫాలో చేస్తామని బదులివ్వడం చాలా బాధేసిందంటూ యువతి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసిన వీడియోలో వాపోయింది. అయితే, ఆ సర్క్యులర్‌ నిజమా..? ఫేకా.? లేక నేనే మిస్టేక్‌ అయ్యనా.? పోలీసులే ఇగ్నోర్‌ చేశారా.? ప్లీజ్‌ చెప్పండి అంటూ పెట్టిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

 క్యాబ్‌ బుక్‌ చేస్తామని చెప్పాం

ఈ విషయమై చందానగర్‌ ఎస్‌హెచ్‌ఓ విజయ్‌ను 'ఆంధ్రజ్యోతి' సంప్రదించగా.. యువతి ఫైనాన్షియల్‌ జిల్లాకు డ్రాప్‌ చేయాలని కోరగా.. అది చాలా దూరమని, తమకు అత్యవసర సేవలు ఉంటాయని, అవసరమైతే క్యాబ్‌ బుక్‌ చేస్తామని చెప్పామని తెలిపారు. అయినా సదరు యువతి వినకుండా.. మీరు దిగబెడితే రండి. లేదంటే రావొద్దు అని చెప్పి నేరుగా ర్యాపిడో బుక్‌ చేసుకొని వెళ్లిందని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

/span>

నేడు పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy