Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ముక్కోణపు సిరీస్ విజేతగా భారత్-ఎ

ముక్కోణపు సిరీస్ విజేతగా భారత్-ఎ

స్పోర్ట్స్ డెస్క్: శ్రీలంక వేదికగా జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్‌ టైటిల్‌ను భారత్- ఎ గెలిచింది. ఇవాళ(ఆదివారం) శ్రీలంక- ఎతో జరిగిన ఫైనల్‌లో భారత్-ఎ 66 పరుగుల తేడాతో విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 377 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లంక జట్టు 47.1 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటైంది.

వనుజ సహన్ (62), సదీర సమరవిక్రమ (52) అర్ధ శతకాలతో లంక విజయం కోసం పోరాడారు.విజయకాంత్ వియాస్కాంత్ 39, సహన్ అరచ్చిగే 38, నిరోషన్ డిక్వెల్లా 25 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు భారత బౌలర్ల దెబ్బకు పెవిలియన్ కు క్యూ కట్టారు. భారత బౌలర్లలో యశ్‌ ఠాకూర్, విప్రాజ్ నిగమ్ చెరో మూడు వికెట్లు సాధించారు. అలానే అనుకుల్‌ రాయ్ 2, అశోక్ శర్మ, తిలక్ వర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు.

టాస్ ఓడిన బౌలింగ్ ఎంచుకోవడమే శ్రీలంక చేసిన తప్పులా అనిపిస్తుంది. తొలుత భారత బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ ( 29 బంతులు, 94 పరుగులు) క్రీజులో ఉన్నంతసేపు లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. చివర్లో అనుకుల్ రాయ్(15 బంతులు, 39 పరుగులు) కూడా లంక బౌలర్లపై దాడి చేయడంతో భారత జట్టు భారీ స్కోర్ చేసింది. మిగిలిన బ్యాటర్లలో తిలక్ వర్మ 67, రుతురాజ్ గైక్వాడ్ 40, ప్రియాంశ్‌ ఆర్య 39, , కుమార్ కుశాగ్ర (36), విప్రాజ్ నిగమ్ 27 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో మథులన్‌, ఫెర్నాండో, వనుజ సహన్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఇక షిరాజ్‌, సహన్‌ అరాచ్చిగే, సముదాయ ఒక్కో వికెట్‌ చొప్పున సాధించారు. వైభవ్ సూర్యవంశీకి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy