నెల్లూరు జిల్లా, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లాలోని ఏఎస్‌పేట దర్గా నిర్వహణకు సంబంధించిన అంశంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఈ దర్గా నిర్వహణలో జరుగుతున్న పరిణామాలపై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం స్పందించారు. దర్గా పవిత్రతను కాపాడేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ దర్గా నిర్వహణకు సంబంధించి ఇస్లాం మతపెద్దలు పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు చేశారు. పోక్సో (POCSO) కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఈ దర్గా వ్యవహారాల బాధ్యతలు అప్పగించడం సముచితం కాదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై స్పందించిన పవన్ కల్యాణ్, మతపరమైన పవిత్ర స్థలాల నిర్వహణలో పారదర్శకత, విశ్వసనీయత అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.
పోక్సో కేసులో ఉన్న వ్యక్తి చేతుల్లో ఏఎస్‌పేట దర్గా నిర్వహణ ఉండటం సరైనది కాదని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. అలాగే దర్గా పవిత్రతకు ఎలాంటి భంగం కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత వక్ఫ్ అధికారులకు లేఖ రాశారు. ఈ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు.
.
యోగాతో ఆరోగ్యవంతమైన, ఆనందమయ ఏపీని నిర్మిద్దాం: సీఎం చంద్రబాబు
ప్రధాని మోదీ చొరవతో యోగాకు అంతర్జాతీయ గుర్తింపు: మంత్రి నారాయణ
Read Latest AP News AndTelangana News And National News
And Telugu News

