Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేను తప్పు చేయలేదు.. దేనికైనా సిద్ధమే.. అరెస్టు తరువాత ఉదయనిధి కామెంట్

నేను తప్పు చేయలేదు.. దేనికైనా సిద్ధమే.. అరెస్టు తరువాత ఉదయనిధి కామెంట్

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు ప్రతిపక్ష డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్టుతో అక్కడ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నటి త్రిషపై అసభ్య వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై పోలీసులు నేడు ఉదయనిధిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

అరెస్టు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశారు. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు.

తనపై వస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే ఉదయనిధి కొట్టిపారేశారు. 'నేను ఎవరిని ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. రైతుల సమస్యలపై ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు పాలక పక్షం వద్ద సమాధానం లేదు. కావేరీ జలాల వివాదంపై కూడా నోరు మెదపట్లేదు. ఈ అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు నిన్న నేను నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తే నన్ను అరెస్టు చేశారు. ఎడిట్ చేసిన కొన్ని వీడియోలను వాళ్లు ప్రచారం చేస్తున్నారు. తప్పుడు వార్తలను వ్యాపింపజేస్తున్నారు' అని ఉదయనిధి అన్నారు.

ఈ వివాదంతో రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారా? అన్న మీడియా ప్రశ్నకు ఆయన స్పందిస్తూ వాళ్లకు అంతటి మెదడు లేదని చెప్పారు. వాళ్లంతా మూర్ఖులని అన్నారు. ఎలాంటి పరిణామాలు ఎదుర్కొనేందుకైనా తాను సిద్ధంగానే ఉన్నానని మరోసారి చెప్పారు. నిన్న ఉదయనిధి పాల్గొన్న కార్యక్రమంలో ఆయన చేసిన కామెంట్స్ వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే.

ఈ వార్తలనూ చదవండి:

సీఎం, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్..

రాజకీయాలకు దూరంగా ఉంటాను: ప్రశాంత్ కిషోర్ భార్య

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy