Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నిర్మాణాత్మక విమర్శలు న్యాయ వ్యవస్థకు అవసరం: సీజేఐ

నిర్మాణాత్మక విమర్శలు న్యాయ వ్యవస్థకు అవసరం: సీజేఐ

న్యూఢిల్లీ, ఆగస్టు 16: పరీక్షలకు అతీతమని తప్పించుకొంటూ న్యాయ వ్యవస్థ ప్రజా విశ్వాసాన్ని పొందలేదని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ అన్నారు. బాధ్యతాయుత సంస్థగా మెలగడానికి న్యాయవ్యవస్థకు నిజాయతీతో కూడిన నిర్మాణాత్మక విమర్శలు అవసరమేనని అభిప్రాయపడ్డారు.

సోమవారం ఇక్కడ ఆయన ఆరో రామ్‌ జఠ్మలానీ స్మారక ఉపన్యాసాన్ని ఇచ్చారు. పరీక్షలకు, ప్రశ్నలకు, అవసరమైతే విమర్శలకు కూడా కోర్టులు సిద్ధంగా ఉండాలని అన్నారు. 'ప్రజా విశ్వాసం', 'ప్రజల ఆమోదం'...ఈ రెండింటి మధ్య ఎంతో తేడా ఉందని జస్టిస్‌ సూర్యకాంత్‌ అన్నారు. ప్రజలకు నచ్చిన విధంగా తీర్పులు ఇవ్వడం ద్వారాగానీ, పాపులారిటీ ద్వారాగానీ న్యాయ వ్యవస్థకు చట్టబద్ధత రాదని చెప్పారు. దీనిని 'ప్రజల ఆమోదం' అని అనుకున్నా, అది ప్రజా విశ్వాసం కిందికి రాదని తెలిపారు. కేసులు ఓడిపోయిన వ్యక్తులు కూడా న్యాయ ప్రక్రియ నిజాయతీగా జరిగిందని నమ్మినప్పుడే ప్రజా విశ్వాసాన్ని పొందుతుందని తెలిపారు.

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 నోటిఫికేషన్ విడుదల

చంపేస్తానంటూ బెదిరింపులు.. నెల్లూరులో రెచ్చిపోయిన వైసీపీ రౌడీ మూకలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy