Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నీట్ శిక్షణ పొందుతున్న హైదరాబాద్ వాసి బలవన్మరణం

నీట్ శిక్షణ పొందుతున్న హైదరాబాద్ వాసి బలవన్మరణం

కృష్ణా జిల్లా, ఆగస్టు 6: జిల్లాలోని కానూరులో విషాదం చోటు చేసుకుంది. నీట్ శిక్షణ పొందుతున్న హైదరాబాద్ యువతి వైష్ణవి(19) బలవన్మరణానికి పాల్పడింది.

హైదరాబాద్‌లోని బేగంపేటకు చెందిన వైష్ణవి నీట్ లాంగ్‌టర్మ్ కోచింగ్ కోసం కృష్ణా జిల్లాలోని శ్రీ భారతి ఇన్‌స్టిట్యూట్‌లో చేరింది. మూడు వారాల కిందటే అక్కడకు వచ్చిన వైష్ణవి.. కుటుంబానికి దూరంగా ఉండలేకపోయింది. ఇంత దూరంలో ఉండి చదవలేనంటూ తల్లిదండ్రులకు ఫోన్ చేసిన తన బాధను చెప్పుకుంది. అయితే బిడ్డ భవిష్యత్తు బాగుండాలని భావించిన తల్లిదండ్రులు.. వైష్ణవికి సర్దిచెప్పారు. ఇంతలోనే తాను ఉంటున్న హాస్టల్ గదిలో యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

హాస్టల్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. యువతి మృతి సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలియజేయడంతో వారంతా హుటాహుటిన కృష్ణాజిల్లాకు చేరుకున్నారు. చదువు కోసం వెళ్లిన తమ బిడ్డ ఇలా విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

6 అర్బన్‌ అథారిటీల్లో అద్భుత ప్రగతి జరగాలి: సీఎం చంద్రబాబు

కర్నూలు బస్సు ప్రమాదం కేసు.. జిల్లా ఎస్పీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy