Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పొలిటికల్ ఎంట్రీపై లారెన్స్ క్లారిటీ.. ప్రజలు ఓకే అంటేనే..

పొలిటికల్ ఎంట్రీపై లారెన్స్ క్లారిటీ.. ప్రజలు ఓకే అంటేనే..

చెన్నై, జూన్ 12: ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. ప్రజలు ఆమోదిస్తేనే తాను రాజకీయాల్లోకి వస్తానని స్పష్టం చేశారు.

ప్రజలు కాదంటే రాజకీయాలకు దూరంగా ఉంటానని అన్నారు. శుక్రవారం తన ఎక్స్ ఖాతాలో రాఘవ లారెన్స్ ఓ వీడియో పోస్టు చేశారు. ఆ వీడియోలో తన రాజకీయ భవిష్యత్తు గురించి వివరించి చెప్పారు. తుది నిర్ణయాన్ని ప్రజలకే వదిలేశారు. పొలిటికల్ ఎంట్రీపై త్వరలో ప్రకటన చేస్తానని చెప్పారు.

లారెన్స్ తన పోస్టులో.. 'ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా.. మీ బాధ్యతను నిజాయతీగా నిర్వర్తించండి. ఈ వీడియో చూసిన తర్వాత, దయచేసి మీ సలహాలను, మార్గదర్శకత్వాన్ని కామెంట్స్ రూపంలో పంచుకోండి. మీరు 'వద్దు' అని చెబితే.. నేను రాజకీయాల్లోకి రాను. సమాజానికి నా నిస్వార్థ సేవను ఇలాగే కొనసాగిస్తాను. కానీ మీరు 'అవును' అని చెబితే.. మీ అందరి ఆశీస్సులతో ఈ రాజకీయ ప్రయాణాన్ని ఎప్పుడు, ఎవరితో కలిసి ప్రారంభించాలో నిర్ణయించుకుంటాను' అని పేర్కొన్నారు.

మామిడిపండ్లు తిని అక్కాచెల్లెళ్ల మృతిపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం

వాటర్ బాటిల్ మూతలు వేర్వేరు రంగుల్లో ఎందుకు ఉంటాయో తెలుసా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy