Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రజాసమస్యల పరిష్కారానికి పవన్ కల్యాణ్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారు: అన్నామలై

ప్రజాసమస్యల పరిష్కారానికి పవన్ కల్యాణ్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారు: అన్నామలై

మరావతి, మే 11 (ఆంధ్రజ్యోతి): ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎల్లప్పుడూ క్రమశిక్షణ, అంకితభావం రాజకీయాల కంటే సేవకే అగ్ర ప్రాధాన్యం ఇస్తారని బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై కుప్పుస్వామి (Annamalai Kuppuswamy) వ్యాఖ్యానించారు.

ప్రజలకు సేవ చేయడానికి పవన్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని పేర్కొన్నారు.

గొప్ప విజయాన్ని పవన్ కల్యాణ్ సాధించాలి..

తన ప్రజాసేవ ప్రస్థానంలో నిరంతరం మంచి ఆరోగ్యంతో, గొప్ప విజయాన్ని పవన్ సాధించాలని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ ట్రాన్స్‌ఫామ్స్ ఏపీలోని 6వ అధ్యాయాన్ని అన్నామలై ఆవిష్కరించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ఈ సందర్భంగా పవన్ నాయకత్వంపై, ప్రజల సంక్షేమానికే అగ్రప్రాధాన్యం ఇచ్చే ఆయన పాలనపై ప్రశంసలు కురిపించారు. తిరుపతి నుంచి పళని వరకు... భక్తుల చిరకాల కోరిక పవన్ కల్యాణ్ నాయకత్వంలో సాకారమైందని ఉద్ఘాటించారు.

భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ ఆర్టీసీ రోజువారీగా రెండు బస్సు సర్వీసులను ప్రారంభించిందని తెలిపారు. భక్తుల కోసం పవన్ చేపట్టిన ఈ చొరవను అభినందిస్తూ అన్నామలై వీడియో విడుదల చేశారు. ప్రజలను కేవలం పౌరులుగా మాత్రమే చూడరని.. వారిని తన సొంత కుటుంబ సభ్యులుగా పవన్ భావిస్తారని చెప్పుకొచ్చారు. వారి సమస్యలను చిత్తశుద్ధి, కరుణ బాధ్యతతో పరిష్కరించడానికి పవన్ కల్యాణ్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని అన్నామలై పేర్కొన్నారు.

.

మా ఇంటికి ప్రధాని రావడం గొప్ప గౌరవం: సీఎం చంద్రబాబు

జగన్ హయాంలో ఆలయాలకు భద్రత కొరవడింది: మంత్రి ఆనం

కైలాసగిరి త్రిశూలం ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి ప్రతీక: మంత్రి నారా లోకేశ్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy