Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాంచీకి వెళ్లిన ధోని.. చెన్నై ప్లే ఆఫ్స్‌కి చేరితే మళ్లీ వెనక్కి వస్తాడా..

రాంచీకి వెళ్లిన ధోని.. చెన్నై ప్లే ఆఫ్స్‌కి చేరితే మళ్లీ వెనక్కి వస్తాడా..

పీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అంటే ధోనీ.. ధోనీ అంటే చెన్నై సూపర్ కింగ్స్. ఆ జట్టుకు ధోనీ ఐదుసార్లు టైటిల్స్ అందించాడు. వయసు పెరుగుతున్నా, గాయాలు పాలవుతున్నా ధోనీని ఆ జట్టు వదులుకోవడం లేదు.

దీంతో గతేడాది చివర్లో బ్యాటింగ్ వచ్చి అభిమానులను అలరించాడు. ఈ సీజన్‌లో కూడా అలాగే చేస్తాడని అందరూ అనుకున్నారు. అయితే అతడు ఇప్పటివరకు సీఎస్కే తరఫున బరిలోకి దిగలేదు. ఫిట్‌నెస్ సమస్యలతోనే అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు (MS Dhoni Ranchi).

సీఎస్కే ఇప్పటికే లీగ్ దశలో 13 మ్యాచ్‌లు ఆడేసింది. తన చివరి లీగ్ మ్యాచ్‌ను గుజరాత్ టైటాన్స్‌తో ఈ రోజు (గురువారం) అహ్మదాబాద్‌లో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో అయినా ధోనీ ఆడతాడని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. అయితే వారికి నిరాశ తప్పడం లేదు. ఎందుకంటే ధోనీ అహ్మదాబాద్‌కు కాకుండా రాంచీ వెళ్లాడు. ఎందుకు వెళ్లాడనేది తెలియదు కానీ, ఈ రోజు మ్యాచ్‌కు మాత్రం అందుబాటులో ఉండడం లేదు (CSK vs GT 2026).

ప్రస్తుతం సీఎస్కే 12 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది (Dhoni injury update). గుజరాత్‌తో మ్యాచ్‌లో గెలిస్తే సీఎస్కే ఖాతాలో 14 పాయింట్లు ఉంటాయి. పంజాబ్, కేకేఆర్, ఆర్ఆర్ తమ చివరి మ్యాచ్‌ల్లో ఓడిపోతే సీఎస్కేకు ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశం వస్తుంది. ఒకవేళ అద్భుతం జరిగి చెన్నై జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరితే ధోనీ ఆడతాడని వార్తలు వస్తున్నాయి. మరి, ధోనీని మరోసారి మైదానంలో చూడాలనుకునే అభిమానుల ఆశలు నెరవేరుతాయో లేదో చూద్దాం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy