Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేవంత్‌.. ఆ ఆధారాలు చూపెట్టు.. కేటీఆర్ సవాల్

రేవంత్‌.. ఆ ఆధారాలు చూపెట్టు.. కేటీఆర్ సవాల్

రాజన్న సిరిసిల్ల జిల్లా, సెప్టెంబర్ 27 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్ల నియోజకవర్గానికి వస్తున్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి (CM Revanth Reddy) మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) ఈరోజు (ఆదివారం) బహిరంగ లేఖ రాశారు.

ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. అసెంబ్లీలో చేసిన ఆరోపణలను ఆధారాలతో సహా ప్రజల ముందు పెట్టాలని సవాల్ చేశారు. రేవంత్‌రెడ్డికి నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే భూ ఆరోపణలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఆ పథకాన్ని ఎందుకు నిలిపివేశారు..

ఎనిమిది వేల ఎకరాల భూమిలో రికవరీ చేసినట్లుగా ప్రకటించిన 2400 ఎకరాల ఆధారాలను చూపెట్టాలని కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. బతుకమ్మ చీరల పంపిణీ పథకాన్ని ఎందుకు నిలిపివేశారో చెప్పాలని పట్టుబట్టారు. సిరిసిల్ల నేత కార్మికులకు ఇవ్వాల్సిన రూ.60 కోట్ల పెండింగ్ బకాయిలను ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పాలని అన్నారు. రైతులకు ఎగ్గొట్టిన రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా బకాయిలపై స్పష్టత ఇచ్చాకే సిరిసిల్లలో రేవంత్‌రెడ్డి అడుగు పెట్టాలని కేటీఆర్ పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ప్రశాంతంగా గణేశ్ నిమజ్జనాలు పూర్తి.. పోలీసులకు సీపీ సజ్జనార్ అభినందనలు

తెలంగాణ తెగువకు నిలువెత్తు నిదర్శనం చాకలి ఐలమ్మ: కేసీఆర్

దేవుళ్ల దగ్గర రాజకీయ నేతల పాటలు పెట్టడం సరికాదు: ఎమ్మెల్యే సంజయ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy