Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీటు బెల్ట్ పెట్టుకోని చిన్నారి.. సర్వీస్‌ను రద్దు చేసిన విమానయాన సంస్థ..

సీటు బెల్ట్ పెట్టుకోని చిన్నారి.. సర్వీస్‌ను రద్దు చేసిన విమానయాన సంస్థ..

ఇంటర్నెట్ డెస్క్: ఓ చిన్నారి సీటు బెల్ట్ పెట్టుకోవడానికి నిరాకరించడంతో ఒక విమాన సర్వీసు రద్దయింది. దీంతో విమానంలోని మిగిలిన ప్రయాణికులు రాత్రంతా విమానాశ్రయంలోనే ఉండాల్సి వచ్చింది.

కెనడాలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 6న విక్టోరియా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టొరంటోకు వెళ్లాల్సిన పోర్టర్ ఎయిర్‌లైన్స్ విమానం బయలుదేరేందుకు సిద్ధమైంది (Porter Airlines flight cancelled).

విమానం గేటు నుంచి కదిలి రన్‌వే వైపు వెళ్తున్న సమయంలో ఓ చిన్నారి పదే పదే తన సీటుపై నిలబడింది. చిన్నారిని సీటులో కూర్చోబెట్టి సీటు బెల్ట్ పెట్టేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించారు. విమాన సిబ్బంది కూడా సహకరించారు. అయినప్పటికీ చిన్నారిని సురక్షితంగా సీటులో ఉంచడం సాధ్యం కాలేదు. ఆ చిన్నారి సీటులో సురక్షితంగా కూర్చోకుండా విమానాన్ని ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదని సిబ్బంది భావించారు. దీంతో విమానం మళ్లీ టెర్మినల్‌కు తిరిగి వచ్చింది (Child refuses seatbelt).

విమానం తిరిగి టెర్మినల్‌కు చేరుకున్న తర్వాత ఆ చిన్నారిని, తల్లిదండ్రులను విమానం నుంచి దించారు (Child safety on flights). అయితే ఈ ప్రక్రియకు సమయం పట్టింది. అప్పటికే అర్ధరాత్రి 12.30 గంటలు దాటడంతో విక్టోరియా అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వేను మూసేశారు. ఫలితంగా విమానం ఆ రోజు ఇక బయలుదేరే అవకాశం లేకపోయింది. దీంతో విమానంలోని మిగిలిన ప్రయాణికులు కూడా విమానం నుంచి దిగాల్సి వచ్చింది. వారు రాత్రంతా విక్టోరియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది. విమానాన్ని మరుసటి రోజుకు తిరిగి షెడ్యూల్ చేశారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి విమానయాన సంస్థ క్షమాపణలు చెప్పింది.

ఈ వార్తలు కూడా చదవండి...

ఎల్‌నినో వేళ పంటలకు పట్టిసీమ నీరే జీవాధారం: సీఎం చంద్రబాబు

అరాచకాలు, అక్రమాలు చేసే వైసీపీ కనుమరుగైపోయింది: మంత్రి డీబీవీ స్వామి

శ్రీశైల మల్లన్న భక్తులకు అలర్ట్.. ఆ సేవలు నిలిపివేత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy