Dailyhunt
సుందర్ పిచాయ్ ఫిదా! మలబార్ కాఫీ రుచి చూశాక వావ్ అంటూ..

సుందర్ పిచాయ్ ఫిదా! మలబార్ కాఫీ రుచి చూశాక వావ్ అంటూ..

ఇంటర్నెట్ డెస్క్: న్యూఢిల్లీలో ఇండియా ఏఐ సమ్మిట్‌లో (India AI Summit) పాల్గొన్న ఆల్ఫబెట్ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai).. అక్కడి భారత్ జీఐ స్టాల్‌లో మలబార్ కాఫీని (Malabar Coffee) రుచి చూసి అద్భుతమంటూ ప్రశంసలు కురిపించారు.

ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఈ కాఫీని ఒక్కసారి టేస్ట్ చేశాక సుందర్ పిచాయ్ కూడా ఫీదా అయిపోయారంటే ఇది ఎంత అద్భుతమో అర్థం చేసుకోవచ్చని కామెంట్ చేశారు. ఈ కాఫీ రుచి ప్రపంచాన్ని మెప్పించిందని కామెంట్ చేశారు. జీఐ ట్యాగ్ (GI Tag) ఉన్న మలబార్ బ్రాండ్ కాఫీని రుచి చూశాక సుందర్ పిచాయ్ 'వావ్..' అంటూ ఒక్క మాటతో ప్రశంసల వర్షం కురిపించారు.

జీఐ ట్యాగ్ ఉన్న భారతీయ ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు పరిచయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్ జీఐ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇండియా ఏఐ సమ్మిట్‌లో ప్రత్యేక స్టాల్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో స్టాల్‌ను సందర్శించిన ఆల్ఫబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ మలబార్ కాఫీపై ప్రశంసలు కురిపించారు.

స్టాల్ ప్రారంభం సందర్భంగా మంగళవారం మంత్రి పీయూష్ గోయల్ నెట్టింట స్పందిస్తూ భారతీయ రుచులను ప్రపంచానికి పరిచయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని అన్నారు.

ఈ సదస్సులో సుందర్ పిచాయ్ పలు కీలక కామెంట్స్ చేశారు. కృత్రిమ మేధతో వేగవంతమైన అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందని అన్నారు. సంప్రదాయక అభివృద్ధి దశలను దాటుకుని మరింత వేగంగా పురోగమించే అవకాశం వర్ధమాన దేశాలకు దక్కుతుందని అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy