Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టబ్‌లో పిల్లలు.. మెడలోతు నీటిలో తండ్రి పోరాటం.. వీడియో వైరల్

టబ్‌లో పిల్లలు.. మెడలోతు నీటిలో తండ్రి పోరాటం.. వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అసోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు ముంచెత్తుడంతో.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో ఓ తండ్రి తన పిల్లలను కాపాడడం కోసం చేసిన ప్రయత్నానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మెడ వరకు మునిగిన అతడు.. తన ముగ్గురు పిల్లలను టబ్‌లో కూర్చొబెట్టి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్తున్నాడు. ఆ ప్రయత్నంలో వారికి ఎలాంటి ప్రమాదం జరగకుండా.. చివరి క్షణం వరకు పిల్లల కోసం పోరాడుతున్నాడు. ఓ వైపు కుండపోతగా వర్షం కురుస్తోంది.

చుట్టు ఉధృతంగా నీరు ప్రవహిస్తోంది. వీటికి తోడు పిల్లలు భయంతో ఏడుస్తున్నారు. అలాంటి సమయంలో ఆ తండ్రి తన ప్రాణాలను పణంగా పెట్టి.. వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతడు ఆ వరద నీటిలో మునిగిపోతాడేమో అనే భయాందోళన వ్యక్తమవుతోంది. అతడు కాస్తా అటు ఇటు అయినా.. ఆ పిల్లలు ఉన్న టబ్ నీటిలో పడిపోయే ప్రమాదం ఉంది. చాలా జాగ్రత్తగా అతడు వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

తల్లి ప్రేమ మాటల్లో వ్యక్తం అయితే.. తండ్రి ప్రేమ చేతల్లో వ్యక్తమవుతుందని అంటున్నారు. ఆ తండ్రి అపారమైన త్యాగానికి, ప్రేమకు నిదర్శనమని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రపంచంలో తండ్రి కంటే గొప్ప రక్షకుడు ఎవరూ ఉండరని పేర్కొంటున్నారు. ఆస్తి, నగదు లేకపోయినా.. తన పిల్లలను తండ్రి ఎప్పడూ వదిలిపెట్టరని చెబుతున్నారు. తల్లిదండ్రుల ధైర్యం, త్యాగంతోపాటు నిస్వార్థమైన ప్రేమకు శక్తిమంతమైన ప్రతీక అంటూ ఈ వీడియోకు క్యాప్షన్‌ జోడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy