Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తమిళనాడు సీఎం విజయ్‌పై ఉదయనిధి వ్యక్తిగత విమర్శలు!

తమిళనాడు సీఎం విజయ్‌పై ఉదయనిధి వ్యక్తిగత విమర్శలు!

చెన్నై, జూన్ 23: తమిళనాడులో టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయాలు కొత్త మలుపు తీసుకున్నాయి. ఇవాళ(మంగళవారం) అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి విజయ్ చేసిన ప్రసంగానికి ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ కౌంటర్ ఇస్తూ వ్యక్తిగత విమర్శలకు దిగారు.

సీఎం విజయ్‌-సంగీత విడాకుల అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు. చెంగల్పట్టు కోర్టులో భర్త కోసం భార్య వెతుకుతున్న కథ రాష్ట్రానికి తెలుసని ఉదయనిధి స్థాలిన్ పేర్కొన్నారు.

మంగళవారం తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా జరిగాయి. హిందీ వివాదం, నీట్, కరూర్ తొక్కిసలాట ఘటన, రైతుల నిరసన అంశాలను సీఎం విజయ్ ప్రస్తావించారు. ప్రతిపక్ష పార్టీలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, వారి ఉచ్చులో రైతులు పడదని తెలిపాడు. అలానే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను అర్థం చేసుకొని, మద్దతు ఇవ్వాలని రైతులను సీఎం కోరారు. విజయం చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్ స్పందించాడు.

ప్రతిపక్షాలు రెచ్చగొట్టడం వల్లే రైతులు నిరసన తెలుపుతున్నారని విజయ్ పేర్కొనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపాడు. చిన్న స్టోరీ చెప్తానంటూ విజయ్ చేసిన వ్యాఖ్యలు రైతుల గౌరవానికి భంగం కలిగించేవిగా ఉన్నాయని ఉదయ్ నిధి స్టాలిన్ పేర్కొన్నాడు. చెంగల్పట్టు కోర్టులో భర్త కోసం భార్య వెతికే కథ మాత్రమే తమిళనాడు ప్రజలకు తెలుసంటూ సీఎం విజయ్ పై ఉదయనిధి వ్యక్తిగత విమర్శలు చేశారు. విజయ్‌ నుంచి విడాకులు కావాలని ఆయన భార్య సంగీత ఫిబ్రవరి 24న చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఆగస్టు 7న తదుపరి విచారణ జరగనుంది.


మేము లేకుండా యూఎస్ చంద్రుణ్ణి చేరుకోలేదు: జర్మనీ మంత్రి

కొత్త పథకానికి పేరు సూచించండి.. రూ. లక్ష బహుమతి గెలుచుకోండి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy