Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టెక్నాలజీ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దుతున్నాం: సీఎం చంద్రబాబు

టెక్నాలజీ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దుతున్నాం: సీఎం చంద్రబాబు

మరావతి, మే 11 (ఆంధ్రజ్యోతి): జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా శాస్త్రవేత్తలు, ఇన్నోవేటర్లు, యువతకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) శుభాకాంక్షలు తెలిపారు.

పోఖ్రాన్ విజయంతో భారతదేశ సాంకేతిక సామర్థ్యం ప్రపంచానికి చాటిందని పేర్కొన్నారు. జ్ఞానం, పరిశోధన, ఆవిష్కరణల ద్వారానే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం పోస్టు పెట్టారు.

టెక్నాలజీ ఆధారిత అభివృద్ధే లక్ష్యం..

భవిష్యత్తు టెక్నాలజీల కోసం ఆంధ్రప్రదేశ్‌లో బలమైన ఎకోసిస్టమ్ నిర్మించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర యువతను ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణులుగా తీర్చిదిద్దేందుకు భారీ స్థాయిలో డీప్‌టెక్ స్కిల్లింగ్ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో IBM SkillsBuild, APSCHE, APSSDC, Quantum Valley భాగస్వామ్యంగా పనిచేస్తున్నాయని వివరించారు.

ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీపై ప్రత్యేక శిక్షణ..

రాష్ట్ర యువతకు క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ వంటి అత్యాధునిక రంగాల్లో శిక్షణ అందించనున్నట్లు సీఎం చెప్పుకొచ్చారు. 2026-27 నాటికి రెండు లక్షల మందికి శిక్షణ ఇవ్వాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని 10 లక్షల మందికి విస్తరించే ప్రణాళికను రూపొందిస్తున్నామని అన్నారు. డిజిటల్ లెర్నింగ్, ఇండస్ట్రీ ట్రైనింగ్, గ్లోబల్ సర్టిఫికేషన్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని వెల్లడించారు.

నాగార్జున యూనివర్సిటీలో ఇన్నోవేషన్ సెంటర్..

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో NIELIT Innovation, Skilling Centre ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ కేంద్రంలో క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ, సెమీకండక్టర్ టెక్నాలజీలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచే కార్యకలాపాలు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. విద్యార్థులు, పరిశోధకులకు వరల్డ్ క్లాస్ ల్యాబ్స్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

NPTEL పరీక్షల్లో ఏపీ విద్యార్థుల ప్రతిభ..

NPTEL జాతీయ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు 4 గోల్డ్, 14 సిల్వర్ మెడల్స్ సాధించడం రాష్ట్ర ప్రతిభకు నిదర్శనమని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ఆధునిక టెక్నాలజీ కోర్సుల్లో మరింత మంది విద్యార్థులు పాల్గొని ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.

క్వాంటమ్ వ్యాలీ విజన్‌తో ముందుకు ఏపీ..

క్వాంటమ్ వ్యాలీ విజన్ ద్వారా భవిష్యత్ టెక్నాలజీలకు సిద్ధమయ్యే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతున్నామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రపంచ స్థాయి పరిశోధన, సాంకేతిక నైపుణ్యాలు, స్టార్టప్ అవకాశాలు, ఇండస్ట్రీ కనెక్టివిటీతో ఏపీని టెక్నాలజీ హబ్‌గా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్ర యువతలో నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా ప్రపంచ మార్కెట్ అవసరాలకు తగిన మానవ వనరులను తయారు చేయాలని తమ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

.

మా ఇంటికి ప్రధాని రావడం గొప్ప గౌరవం: సీఎం చంద్రబాబు

జగన్ హయాంలో ఆలయాలకు భద్రత కొరవడింది: మంత్రి ఆనం

కైలాసగిరి త్రిశూలం ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి ప్రతీక: మంత్రి నారా లోకేశ్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy