Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిరుపతిలో విషాదం.. క్రేన్ కిందపడి ముగ్గురి మృతి

తిరుపతిలో విషాదం.. క్రేన్ కిందపడి ముగ్గురి మృతి

తిరుపతి, సెప్టెంబర్ 29: తిరుపతిలోని డి.బి.ఆర్ రోడ్డు వద్ద ఉన్న శ్రీ కన్వెన్షన్ సమీపంలో క్రేన్ కిందపడి ముగ్గురు మరణించారు. ఆ కన్వెన్షన్ పక్క స్థలంలో భవన నిర్మాణానికి పునాదులు తీస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

మట్టి తోడుతున్న క్రేన్ గుంటలోకి పడిపోవడంతో దాని కిందపడి ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఒడిశాకు చెందిన రామారావు (45), శ్రీకాకుళం జిల్లాకు చెందిన సివిల్ ఇంజినీర్ సందీప్ (34), తిరుపతికి చెందిన గార్డెన్ వర్కర్ చెంగయ్య (40) మృతిచెందినట్టు పోలీసులు గుర్తించారు.

కాగా ప్రమాదం అనంతరం ముగ్గురి మృతదేహాలను 108 అంబులెన్స్ ద్వారా తిరుపతిలోని రుయా హాస్పిటల్ మార్చురీకి తరలించారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరు కార్మికులు ప్రస్తుతం డీబీఆర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని వారు వెల్లడించారు.

ఈ వార్తలూ చదవండి

గుంటూరులో విషాదం.. కారులో మంటలు.. వ్యక్తి సజీవ దహనం

తిరుపతి-కాట్పాడి రైల్వే డబ్లింగ్‌ భూసేకరణకు గెజిట్‌

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy