MacBook Android Apps: చాలామంది ఐఫోన్ వాడుతూ మ్యాక్‌బుక్‌ను కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఆండ్రాయిడ్‌లో లభించే కొన్ని యాప్స్, గేమ్‌లను మ్యాక్‌బుక్‌లో కూడా వాడాలని కోరుకుంటుంటారు.
సాధారణంగా యాపిల్ ఎకోసిస్టమ్ క్లోజ్డ్‌గా ఉన్నప్పటికీ.. కొన్ని సులువైన పద్ధతుల ద్వారా ఆండ్రాయిడ్ యాప్స్‌ను మ్యాక్‌బుక్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా రన్ చేసుకోవచ్చు. దీనికోసం అందుబాటులో ఉన్న ఉత్తమ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆండ్రాయిడ్ స్టూడియో ద్వారా సపోర్ట్:
మ్యాక్‌బుక్‌లో ఆండ్రాయిడ్ యాప్స్‌ను రన్ చేయడానికి ఆండ్రాయిడ్ స్టూడియో అద్భుతమైన మార్గం. దీనిలో ఉండే అఫీషియల్ ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ ద్వారా మొబైల్ యాప్స్, గేమ్స్, ఇతర టూల్స్‌ను నేరుగా మ్యాక్ ఓఎస్‌లో టెస్ట్ చేయొచ్చు. ఇది కేవలం యాప్స్ డెవలప్ చేసే వారికే కాకుండా.. ఆండ్రాయిడ్‌ను కంప్యూటర్‌లో పూర్తిగా వాడుకోవాలనుకునే సాధారణ యూజర్లకు కూడా బాగా ఉపయోగపడుతుంది.
బ్లూస్టాక్స్, నాక్స్ ప్లేయర్ సాయంతో:
కంప్యూటర్‌లో మొబైల్ గేమ్స్ ఆడాలనుకునే వారికి బ్లూస్టాక్స్, నాక్స్ ప్లేయర్ వంటి ఎమ్యులేటర్లు బాగా పరిచయం. ఇవి మ్యాక్‌బుక్‌లో కూడా చాలా స్కూత్‌గా పనిచేస్తాయి. గూగుల్ ప్లే స్టోర్ నుండి నేరుగా సోషల్ మీడియా యాప్స్, మెసేజింగ్ టూల్స్, భారీ గేమ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇవి వీలు కల్పిస్తాయి. కీబోర్డ్ మ్యాపింగ్, మల్టీటాస్కింగ్ ఫీచర్లు ఉండటం వల్ల వీటిని వాడటం మరింత సులువవుతుంది.
స్మార్ట్‌వాచ్ కొనేముందు చాలామంది చేసే తప్పు ఇదే.. ఈ ఒక్క తేడా తెలుసుకోకపోతే మనీ వేస్ట్!
జెనీమోషన్, వర్చువల్ మెషీన్స్:
కొంచెం అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కావాలనుకునే వారు జెనీమోషన్ వంటి క్లౌడ్ ఆధారిత ఎమ్యులేటర్లను ప్రయత్నించవచ్చు. ఇది సిస్టమ్‌పై ఎక్కువ భారం పడకుండా లైట్‌వెయిట్‌గా పనిచేస్తుంది. అలాగే విర్చువల్‌బాక్స్ లేదా విఎమ్‌వేర్ వంటి సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించి మ్యాక్‌బుక్ లోపలే ఒక ఆండ్రాయిడ్ ఎన్విరాన్‌మెంట్‌ను క్రియేట్ చేయొచ్చు. దీనికి కొంత సమయం పట్టినప్పటికీ.. సెట్టింగ్స్‌పై పూర్తి కంట్రోల్ లభిస్తుంది. క్లౌడ్ గేమింగ్ టూల్స్ ద్వారా కూడా కొన్ని యాప్స్ స్ట్రీమ్ చేసుకోవచ్చు.
ఇన్‌స్టాల్‌కు ముందు చేయాల్సినవి:
ఈ ఎమ్యులేటర్లను ఇన్‌స్టాల్ చేసే ముందు మ్యాక్‌బుక్ మోడల్, ప్రాసెసర్ టైప్ (ఇంటెల్ లేదా యాపిల్ సిలికాన్), RAM సామర్థ్యాన్ని ఒకసారి సరిచూసుకోవాలి. ఎందుకంటే.. పాత ఇంటెల్ మోడల్స్‌తో పోలిస్తే కొత్త యాపిల్ ఎమ్ సిరీస్ చిప్‌లలో వీటి పర్ఫార్మెన్స్ వేరుగా ఉంటుంది. అలాగే మ్యాక్ ఓఎస్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం ద్వారా మంచి స్పీడ్, స్టెబిలిటీని పొందవచ్చు.

