Ishan Kishan - RBI Bank Job: టీమిండియా యంగ్ క్రికెటర్ ఇషాన్ కిషన్ ( Ishan Kishan ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జార్ఖండ్ నుంచి వచ్చిన ఇషాన్ కిషన్… గత ఏడాది కాలంగా టీమిండియాలో పటిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు.
ముఖ్యంగా టి20లో విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేశాడు. అలాంటి ఇషాన్ కిషన్ తాజాగా ఆర్బీఐ బ్యాంకులో పని చేస్తున్నట్లు ఫోటోలు వైరల్ అయ్యాయి. బ్యాంకులో కొంత మంది సిబ్బందితో బిజీ బిజీగా పని చేస్తున్నట్లుగా ఇషాన్ కిషన్ ఫోటోలు బయటకు వచ్చాయి. ఫార్మల్ డ్రెస్ లో అచ్చం హీరోలా మెరిసాడు. అంతేకాదు ఆర్బీఐ ( RBI) బ్యాంకుకు సంబంధించిన ఐడీ కార్డు కూడా అతని మెడలో ఉండడం గమనార్హం. ఈ క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉప శాఖలో టీమిండియా యంగ్ క్రికెటర్ ఇషాన్ కిషన్ విధులు నిర్వర్తిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. టీ20 మ్యాచ్ లు ఇప్పట్లో లేకపోవడంతో, పార్ట్ టైం జాబ్ చేస్తున్నట్లు అతని ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు.
RBI బ్యాంక్ లో ఉద్యోగం చేస్తోన్న ఇషాన్ కిషన్..ఫోటోలు వైరల్
టీమిండియా కుర్ర క్రికెటర్ ఇషాన్ కిషన్ ఆర్బీఐ బ్యాంకులో ( RBI Bank) పని చేసిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ క్రమంలో దీనిపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. పాట్నాలోని ఆర్బీఐ రీజనల్ ఆఫీసులో అసిస్టెంట్ మేనేజర్ గా ఇషాన్ కిషన్ ఉద్యోగం చేస్తున్నట్లు చెబుతున్నారు. టీమిండియా జట్టుకు ఇప్పట్లో టి20లు లేని నేపథ్యంలో ఈ ఉద్యోగం పార్ట్ టైంగా ఇషాన్ కిషన్ చేస్తున్నాడట. స్పోర్ట్స్ కోటాలో ఇషాన్ కిషన్ కు ఈ ఉద్యోగం వచ్చినట్లు తెలుస్తోంది. ఇండియాలోని ఇతర క్రీడాకారులు కూడా ఇలాగే పార్ట్ టైం జాబులు చేస్తున్నారు. స్పోర్ట్స్ కోటాలో వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలను చేస్తూ, అటు ఆటలపై ఫోకస్ చేస్తారు. ఇప్పుడు టీమిండియా ( Team India) కుర్ర క్రికెటర్ ఇషాన్ కిషన్ కూడా ఆర్బీఐ బ్యాంకులో ( RBI) అలాగే చేస్తున్నట్లు చెబుతున్నారు.
ఇషాన్ కిషన్ జీతం ఎంతంటే ?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రాంతీయ కార్యాలయంలో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేసే ఉద్యోగుల జీతం సుమారు 1.22 లక్షల నుంచి 1.24 లక్షల వరకు ఉంటుంది. పన్నులు, పీఎఫ్ అలాగే ఇతర కటింగ్ లు పోను ప్రతినెల నికర జీతం 1,08 లక్షల నుంచి 1.12 లక్షల వరకు చేతికి వస్తాయి. టీమిండియా కుర్ర క్రికెటర్ ఇషాన్ కిషన్ కూడా అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తున్నాడు కాబట్టి, అతనికి కూడా 1,08 లక్షల నుంచి 1.12 లక్షల వరకు జీతం చేతికి వస్తాయి.

