Rice Cutlet :అన్నం మిగిలిపోయిందా? అయితే కరకరలాడే ఈ రైస్ కట్లెట్ ట్రై చేయండి.. మిగిలిన అన్నంతో రైస్ కట్లెట్ ఎప్పుడైనా ట్రై చేశారా? టేస్ట్ అదుర్స్..పిల్లలు కూడా వాటిని ఇష్టంగా తింటారు.
ఎప్పుడూ అన్నం తినేవారు.. దీనితో కొత్త టేస్ట్ చూడొచ్చు.
కావాల్సిన పదార్ధాలు
అన్నం 1 కప్పు,టమాటా రసం అరకప్పు,వెన్న -1 స్పూన్,అల్లం చిన్న ముక్క,చీజ్ 50 గ్రాములు,బ్రెడ్ పొడి -1, ఉప్పు,మిరియాలపొడి అర స్పూన్,నూనె వేయించడానికి సరిపడా,ఉప్పు తగినంత
Also Read:బాడీ హీట్, బ్లడ్ ప్రెజర్.. రెండింటికీ చెక్ పెట్టే మ్యాజిక్ జ్యూస్ ఇదే!
తయారు చేయు విధానం
బాండీలో వెన్న కరిగించి అందులో అన్నం, బెల్లం ముక్కలు వేయించాలి. కొద్దిసేపయ్యాక ఒక గ్లాసు నీళ్లు పోసి సన్నని మంట మీద ఉడికించాలి.సగం నీళ్లు ఇంకి పోయాక టమోటా రసం, మిరియాల పొడి, ఉప్పు కలపాలి.తర్వాత అందులోనే చీజ్ వేసి పొయ్యి కట్టేయ్యాలి.
Also Read:మైగ్రేన్ తలనొప్పికి తక్షణ ఉపశమనం: ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు!
చల్లారాక ఈ మిశ్రమాన్ని ఉండలు చేసుకుని కొద్దిగా వెడల్పుగా(కట్లెట్ ఆకారంలో) చేసి నూనెలో వేయించుకోవాలి.వీటిని అల్లం చట్నీ లేదాటమాటా సాస్తో తింటే చాలా రుచిగా ఉంటాయి.
Also Read:నీరసం, అలసట మాయం.. ఉదయాన్నే ఈ ఒక్క గ్లాస్ తాగితే రోజంతా ఫుల్ ఎనర్జీ!

