Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
1.6 కిలోల వెండి ఖడ్గం.. మొక్కు తీర్చుకున్న సీఎం విజయ్!

1.6 కిలోల వెండి ఖడ్గం.. మొక్కు తీర్చుకున్న సీఎం విజయ్!

Chitrajyothy 1 week ago

మిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (Tamil Nadu CM Vijay).. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఏదో రకంగా వార్తలలో నిలుస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన కర్ణాటక రాష్ట్రం ఉడుపి జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం కొల్లూరు మూకాంబికాదేవిని (Mookambika Temple) దర్శించుకుని వార్తలలో హైలెట్ అవుతున్నారు.

తమిళనాడు సీఎం కర్ణాటకలో మొక్కులు తీర్చుకోవడానికి వచ్చారంటూ.. ఆయన ఫొటోలను, వీడియోలను నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మూకాంబికా దేవిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు సీఎం విజయ్.. చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో మంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు కర్ణాటక మంత్రి యూటీ ఖాదర్ సాదరంగా స్వాగతం పలికారు.

అక్కడి నుంచి రోడ్డు మార్గాన కొల్లూరుకు చేరుకున్నారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం సీఎం విజయ్.. చొక్కా తీసివేసి దర్శనం చేసుకున్నారు. ప్రధాన అర్చకుడు రామచంద్ర అడిగ ప్రత్యేక సంకల్పం జరిపించారు. ఆలయంలో ప్రవేశించే ముందు, తర్వాత ధ్వజస్తంభానికి విజయ్ నమస్కరించారు. ప్రత్యేక పూజల అనంతరం.. మూకాంబికాదేవికి 1.6 కేజీల వెండి ఖడ్గాన్ని సమర్పించారు. అరగంటకు పైగా ఆయన ఆలయంలోనే గడిపారు. ఇదే సందర్భంలోనే ఒకప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ (MGR) మూకాంబికాదేవికి సమర్పించిన బంగారు ఖడ్గాన్ని విజయ్ వీక్షించారు.

విజయ్ కొల్లూరుకు వస్తున్నారని తెలిసి పెద్ద ఎత్తున విజయ్ అభిమానులు తరలివచ్చారు. ఆలయం నుంచి కాస్త దూరం నడుచుకుంటూ వెళ్లిన సీఎం విజయ్.. అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. కాగా, కావేరి నదికి అనుబంధంగా మేకెదాటు ప్రాజెక్టు నిర్మాణానికి సీఎం విజయ్ అభ్యంతరం తెలపడాన్ని వ్యతిరేకిస్తూ.. కర్ణాటక రక్షణ వేదిక (కరవే) ప్రవీణ్ శెట్టి వర్గం కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన తెలిపారు. పోలీసులు.. వారిని ముందుగానే కట్టడి చేయడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. ఆలయ సందర్శన అనంతరం ఆయన మంగళూరు విమానాశ్రయం వరకు దాదాపు 130 కి.మీ. మేర తన కాన్వాయ్‌తో కలిసి స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్లడం విశేషం.

ఇవి కూడా చదవండి:

వారెవ్వా అనిల్‌ రావిపూడి.. నీ చర్యలు ఊహాతీతం!

Samantha: సమంత 'లేడీ బాషా'.. బాబోయ్ ఈ ఎలివేషన్స్ ఏంటి?

ఆ రోజు బాలయ్య ఆశీర్వదించినట్లే జరగడంతో.. ఆనందంలో నారా బ్రహ్మణి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy