Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Samantha: సమంత 'లేడీ బాషా'.. బాబోయ్ ఈ ఎలివేషన్స్ ఏంటి?

Samantha: సమంత 'లేడీ బాషా'.. బాబోయ్ ఈ ఎలివేషన్స్ ఏంటి?

Chitrajyothy 1 week ago

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటిస్తున్న 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaaram) జూన్ 19న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

ఈ సినిమాకు టాలెంటెడ్ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి (Nandini Reddy) దర్శకత్వం వహించడం విశేషం. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా దర్శకురాలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఎవర్‌గ్రీన్ బ్లాక్ బస్టర్ 'బాషా' తెలుగు ప్రేక్షకులకు ఎంతటి కల్ట్ క్లాసిక్‌గా మిగిలిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫస్టాఫ్‌లో ఆటో డ్రైవర్‌గా, సెకండాఫ్‌లో మాఫియా డాన్‌గా రజనీకాంత్ (Super Star Rajinikanth) విశ్వరూపం ప్రదర్శించిన ప్రభంజనం జగమెరిగిన సత్యం. సరిగ్గా అలాంటి షేడ్స్‌లోనే ఈ సినిమాలో సమంత పాత్ర ఉండబోతోందని నందిని రెడ్డి ప్రకటించడం, సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.

ఈ సినిమాలో సమంత క్యారెక్టరైజేషన్ గురించి దర్శకురాలు చెబుతూ, హాలీవుడ్ యాక్షన్ మూవీ 'కిల్ బిల్' హీరోయిన్ 'కలిసుందాం రా' సినిమాలో కలిస్తే ఎలా ఉంటుందనే సరికొత్త పాయింట్‌తో ఈ కథను రూపొందించినట్లు స్పష్టం చేశారు. అంటే ఒక పద్ధతి గల సాంప్రదాయ కుటుంబానికి కోడలిగా వచ్చిన ఓ యువతి వెనుక ఊహించని పవర్‌ఫుల్ ఫ్లాష్‌బ్యాక్ ఉంటుందన్న మాట. ఇందులో సమంత చేసే యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. బాషాతో పోలిక అంటే ఏమాత్రం చిన్న విషయం కాదు, ఆ స్థాయి కంటెంట్ కనుక స్క్రీన్ మీద వర్కౌట్ అయితే, 'ఖుషి' తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సామ్‌కు ఇది ఒక సాలిడ్ కమ్‌బ్యాక్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ట్రేడ్ వర్గాలు సైతం ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతుందన్న గట్టి నమ్మకంతో ఉన్నాయి. కేవలం సమంత ఇమేజ్, క్రేజ్ మీదే ఈ సినిమా బిజినెస్ జరుగుతుండటం గమనార్హం. స్టార్ హీరోల ప్రమేయం లేకుండా తెరకెక్కిన ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని ఆమె భర్త రాజ్ నిడిమోరు (Raj Nidimoru) స్వయంగా నిర్మిస్తుండటం మరో విశేషం. ఈ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ లో సమంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూసి అభిమానులు థ్రిల్ అవ్వడం ఖాయమని యూనిట్ బలంగా నమ్ముతోంది.

బాక్సాఫీస్ వద్ద 'మా ఇంటి బంగారం' చిత్రానికి పోటీ పరంగా చూసుకుంటే.. మరీ సీరియస్ అడ్డంకులైతే ఏమీ కనిపించడం లేదు. అయితే అదే సమయంలో విడుదల కానున్న 'దీవానా, వంద దేవుళ్ళు' వంటి సినిమాలు ఎంతవరకు కాంపిటీషన్ ఇస్తాయనేది ఆయా సినిమాలకి వచ్చే టాక్ మీద ఆధారపడి ఉంటుంది. వీటితో పాటు 'లెనిన్' చిత్రం కూడా రేసులో ఉండటంతో సమంత సినిమాకు మొదటి వారం రన్ చాలా కీలకం కానుంది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం సెకండ్ వీక్ కూడా వసూళ్ల వర్షం కురవడం ఖాయం. అప్పటికే 'పెద్ది' సినిమా రన్ కాస్త స్లో అయిపోయి ఉంటుంది కాబట్టి, ఆ ఖాళీని 'మా ఇంటి బంగారం' పూర్తిగా సద్వినియోగం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి యాక్షన్‌తో కలగలిపిన ఈ పవర్‌ఫుల్ లేడీ బాషా జూన్ 19న బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

ఆ రోజు బాలయ్య ఆశీర్వదించినట్లే జరగడంతో.. ఆనందంలో నారా బ్రహ్మణి!

ఎన్టీఆర్ లైనప్‌లో ఊహించని ట్విస్ట్.. నెల్సన్ సినిమా లేనట్టేనా

నేనేం తప్పు చేశానని నాకు ఈ శిక్ష: చిరంజీవి కుమార్తె శ్రీజ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy