Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'రావు బహదూర్'.. ఆంధ్ర, సీడెడ్, నైజాంలో వేరువేరుగా టికెట్ ధరలు

'రావు బహదూర్'.. ఆంధ్ర, సీడెడ్, నైజాంలో వేరువేరుగా టికెట్ ధరలు

Chitrajyothy 3 weeks ago

సూపర్‌స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu), నమ్రతా శిరోద్కర్‌ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో.. వెంకటేష్ మహా దర్శకత్వంలో, వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ (Satyadev) కథానాయకుడిగా నటించిన సైకాలజికల్ డ్రామా 'రావు బహదూర్' (Rao Bahadur).

ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి అండ్ శరత్ చంద్ర నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, పాటలు, టీజర్లు సినిమాపై అంచనాలు పెంచేసిన విషయం తెలిసిందే. జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైన ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఈ సినిమాను అందరికీ చేరువ చేయాలనే ఉద్దేశంతో టికెట్ల ధరలను (Rao Bahadur Ticket Prices) పెంచడం లేదు. అంతేకాదు.. ఆంధ్ర, సీడెడ్, నైజాం ఏరియాలలో సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ థియేటర్లలో వేరువేరుగా ఈ సినిమాకు టికెట్ల ధరలను ఫైనల్ చేశారు. ఈ మేరకు మేకర్స్ వదిలిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టర్ ప్రకారం.. తెలంగాణ అంతటా సింగిల్ స్క్రీన్‌లో రూ. 150, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ. 200గా టికెట్ ధర ఉంటుందని తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో సింగిల్ స్క్రీన్‌లో రూ. 145, మల్టీప్లెక్స్‌లో రూ. 177గా ఫైనల్ చేశారు. ఇక సీడెడ్‌లో అయితే టికెట్ ధరను భారీగా తగ్గించారు.

సీడెడ్ ఏరియా మొత్తం 'రావు బహదూర్' సినిమాను సింగిల్ స్క్రీన్‌లో రూ. 100 కే చూడవచ్చు. మల్టీప్లెక్స్‌లో రూ. 177గా టికెట్ ధర ఉంటుందని తెలుపుతూ మేకర్స్ పోస్టర్‌లో పేర్కొన్నారు. నిజంగా, ఇది ప్రేక్షకులు గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. మొదటి రోజు టాక్ కనుక పాజిటివ్‌గా వస్తే మాత్రం.. టికెట్ ధరలు తక్కువగానే ఉన్నాయి కనుక.. ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు థియేటర్లకు తరలి వచ్చే అవకాశం లేకపోలేదు. చూద్దాం మరి.. మేకర్స్ ప్లాన్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో..

ఇవి కూడా చదవండి:

'జైలర్ 2'కి పోటీగా.. చిరంజీవి 'విశ్వంభర' రిలీజ్ అప్పుడేనా!

మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ చిత్రం ప్రారంభం.. హీరో ఎవరంటే

దర్శకుడు మెహర్ రమేష్ కుమార్తె పెళ్లిలో చిరు, వెంకీ, పవన్ సందడి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy