Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'జైలర్ 2'కి పోటీగా.. చిరంజీవి 'విశ్వంభర' రిలీజ్ అప్పుడేనా!

'జైలర్ 2'కి పోటీగా.. చిరంజీవి 'విశ్వంభర' రిలీజ్ అప్పుడేనా!

Chitrajyothy 3 weeks ago

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ చిత్రం 'విశ్వంభర' (Vishwambhara).

'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ విజువల్ వండర్‌లో చిరు సరసన త్రిష (Trisha) కథానాయికగా నటిస్తోంది. ఎప్పటి నుంచో నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కారణంగా కొంత జాప్యానికి గురైనప్పటికీ.. ఇప్పుడు సరికొత్తగా ముస్తాబవుతోంది. తాజా ఫిలిం నగర్ టాక్ ప్రకారం.. ఈ మెగా ప్రాజెక్ట్‌ను ఈ ఏడాది దసరా కానుకగా అక్టోబర్ 16న విడుదల చేయడానికి మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారట. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకోగా, ఆగస్ట్ చివరి నాటికి ఫైనల్ కాపీ సిద్ధం కానుందని సమాచారం.

గతంలో వచ్చిన 'జగదేకవీరుడు అతిలోకసుందరి', 'అంజి' సినిమాల తర్వాత చిరంజీవి మళ్లీ తన ఫేవరెట్ జానర్‌ని టచ్ చేస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ చిత్రానికి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ అవుట్‌పుట్ ఇప్పుడు చాలా సంతృప్తికరంగా వచ్చిందని, దీని వెనుక టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) పర్యవేక్షణ బాగా ఉపయోగపడిందని ఇండస్ట్రీ టాక్. ఇక ఆస్కార్ విన్నర్ ఎమ్ ఎమ్ కీరవాణి ఈ చిత్రానికి అద్భుతమైన పాటలు కంపోజ్ చేయగా.. ఒక ప్రత్యేక గీతాన్ని భీమ్స్ సిసిరోలియో, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాధ్యతలను గౌర హరి పంచుకున్నట్లు తెలుస్తోంది.

అయితే, దసరా బరిలో మెగాస్టార్‌ ఒంటరిగా రావడం లేదు. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) తన బ్లాక్‌బస్టర్ సీక్వెల్ 'జైలర్ 2' (Jailer 2) తో గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ మూవీని అక్టోబర్ 15న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దీనిపై మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో మొదట క్యామియో రోల్స్ కోసం బాలకృష్ణ, షారుఖ్ ఖాన్ లని సంప్రదించగా వారు నో చెప్పడంతో కొంతకాలం షూట్ పెండింగ్‌లో పడింది. కానీ, చివరికి బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రీసెంట్‌గా చెన్నైలో ఓ భారీ ఎపిసోడ్‌ని పూర్తి చేశారు. ఈ కాంబినేషన్ సీన్స్ సినిమాకే మేజర్ హైలైట్‌గా నిలుస్తాయని టాక్.

కేవలం ఒక రోజు వ్యవధిలో 'విశ్వంభర', 'జైలర్ 2' బాక్సాఫీస్ వద్ద తలపడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. గతంలో 2023 ఆగస్ట్‌లో కూడా ఈ ఇద్దరు మహామహులు 'భోళా శంకర్', 'జైలర్' చిత్రాలతో తలపడ్డారు. ఆనాటి ఫలితాన్ని మెగా ఫ్యాన్స్ అంత సులభంగా మర్చిపోలేరు. ఆ తర్వాత చిరంజీవి దాదాపు రెండేళ్ల గ్యాప్ తీసుకొని 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాతో వచ్చి సూపర్ హిట్ కొట్టారు. మరోవైపు రజినీకాంత్‌కు 'లాల్ సలామ్, వెట్టయాన్, కూలీ' చిత్రాలతో ఆశించిన స్థాయిలో సక్సెస్ దక్కలేదు. దీంతో రజినీ మళ్లీ కంబ్యాక్ ఇవ్వడానికి 'జైలర్ 2'పైనే భారీగా ఆశలు పెట్టుకున్నారు. అఫీషియల్ అనౌన్స్‌మెంట్స్ వచ్చాక ఈ క్లాష్‌పై పూర్తి క్లారిటీ రానుంది. మరి ఈ మెగాస్టార్ వర్సెస్ సూపర్ స్టార్ హై-వోల్టేజ్ పోరులో ఈసారి విజేతగా ఎవరు నిలుస్తారో చూడాలి!.

ఇవి కూడా చదవండి:

మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ చిత్రం ప్రారంభం.. హీరో ఎవరంటే

దర్శకుడు మెహర్ రమేష్ కుమార్తె పెళ్లిలో చిరు, వెంకీ, పవన్ సందడి

వెంకీ కోసం చేసిన పాటలు.. ఉదయ్ కిరణ్ సినిమాకు వాడేశారు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy