Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఐకాన్ స్టార్ 'రాకా' చుట్టూ ఇంత రహస్యం ఎందుకు?

ఐకాన్ స్టార్ 'రాకా' చుట్టూ ఇంత రహస్యం ఎందుకు?

Chitrajyothy 21 hrs ago

'పుష్ప 2' చిత్రంతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రికార్డుల తుఫాన్ సృష్టించారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun). 'పుష్ప' ఇచ్చిన అదే జోరును బన్నీ ప్రస్తుతం కొనసాగిస్తున్నారు.

ఇటు టాలీవుడ్ నుంచి అటు బాలీవుడ్ వరకు, ఇప్పుడు ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరి చూపు బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్‌పైనే ఉంది. బాలీవుడ్‌లో 'జవాన్'తో రూ.1000 కోట్ల రికార్డు కొట్టిన బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో.. అల్లు అర్జున్ నటిస్తోన్న పాన్-ఇండియా వండర్ 'రాకా' (Raaka). తమిళ దిగ్గజ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని ఏకంగా రూ.800 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు.

అయితే, ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయి సెట్స్‌పైకి వెళ్లి ఏడాది దాటినా కూడా.. ఇప్పటివరకు ఒక్క ఫస్ట్ లుక్ పోస్టర్ మినహా మరే చిన్న డీటైల్ కూడా బయటకు రాలేదు! అస్సలు ఏముంది ఈ 'రాకా' కథలో? ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. ఇదొక హై-వోల్టేజ్ పీరియాడికల్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా. ఇందులో క్యాస్టింగ్ వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. బాలీవుడ్ లేడీ సూపర్‌స్టార్ దీపికా పదుకోణ్ ఒక పవర్‌ఫుల్ వారియర్ పాత్రలో మెరవనుండగా.. జాన్వీ కపూర్, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ లాంటి క్రేజీ హీరోయిన్స్ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంత భారీ తారాగణం, వందల మంది సాంకేతిక నిపుణులు నిరంతరం సెట్స్‌లో పనిచేస్తున్నప్పటికీ.. సినిమా నుంచి ఒక్క లీక్ కూడా రాకపోవడం నిజంగా అన్‌బిలీవబుల్. సాధారణంగా మన ఇండస్ట్రీలో ఏ పెద్ద సినిమా షూటింగ్ జరుగుతున్నా.. పిక్స్ లేదా స్టోరీ లైన్ ఏదో రకంగా లీక్ అవుతూనే ఉంటుంది. కానీ 'రాకా' విషయంలో మాత్రం అట్లీ యూనిట్ వేసిన స్పెషల్ సెక్యూరిటీ ప్లానింగ్ వేరే లెవెల్‌లో ఉంది. ఎంతలా అంటే.. అల్లు అర్జున్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ సైతం.. ఈ సినిమా స్టోరీ లేదా అప్‌డేట్స్ గురించి అడిగితే నాకు కూడా ఏమీ తెలియదు సామీ అని తేల్చి చెప్పారు.

పెద్ద సినిమాలకు చిన్న లీక్ వచ్చినా సోషల్ మీడియాలో హైప్ దెబ్బతింటుంది. అందుకే, థియేటర్లలో ప్రేక్షకులకు ఇచ్చే సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్ చెడిపోకూడదనే ఉద్దేశంతోనే అట్లీ అండ్ టీమ్ ఈ రేంజ్ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ప్రస్తుతం కేవలం ఊహాగానాలు, ఊహకందని అంచనాల మధ్య సాగుతున్న ఈ 'రాకా' ప్రయాణం.. త్వరలోనే రాబోయే టీజర్‌తో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలంటే మరికొన్ని రోజులు వేచిచూడక తప్పదు.

ఇవి కూడా చదవండి:

బాక్సాఫీస్ వద్ద 'ఇరుముడి' విధ్వంసం.. 2 డేస్ కలెక్షన్స్ ఎంతంటే

Biopic Boom: బయోపిక్‌ల హవా.. తెరపైకి వస్తున్న సంచలన జీవితగాథలు!

జాంబీ రెడ్డి 2.. ఈ రేంజ్ లెవెల్ ఊహించలేదయ్యా వర్మా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy