Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అక్క జ్ఞాపకాలను పంచుకుంటూ.. ఆసక్తికర ఫొటో షేర్ చేసిన మెహెర్ రమేష్

అక్క జ్ఞాపకాలను పంచుకుంటూ.. ఆసక్తికర ఫొటో షేర్ చేసిన మెహెర్ రమేష్

Chitrajyothy 3 weeks ago

ప్రముఖ దర్శకుడు మెహెర్ రమేష్ (Meher Ramesh) కుటుంబంలో తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి. ఆయన అక్క మెహెర్ జ్యోతి సుంకర (సుంకర శివప్రసాద్ భార్య) ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే.

దాదాపు 14 రోజుల పాటు వైరల్ న్యుమోనియాతో పోరాడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ ఊహించని విషాదం మెహెర్ రమేష్ కుటుంబ సభ్యులను, అత్యంత సన్నిహితులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. అక్కను కోల్పోయిన బాధలో ఉన్న మెహెర్ రమేష్.. సోషల్ మీడియా వేదికగా తన అక్క జ్ఞాపకాలను పంచుకుంటూ పెట్టిన భావోద్వేగ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

తమ కుటుంబానికి ఎంతగానో ఇష్టమైన, ఎల్లప్పుడూ చిరునవ్వుతో, నిస్వార్థమైన ప్రేమను పంచే అక్క (Meher Jyothi Sunkara) ఇక లేరనే నిజం తట్టుకోలేకపోతున్నానని మెహెర్ రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో తమ కుటుంబానికి కొండంత అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి - సురేఖ దంపతులు, నాగబాబు - పద్మజ దంపతులు, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ - అన్నా కొణిదెల దంపతులతో పాటు ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్, తోట కుటుంబానికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ పోస్ట్‌తో పాటు మెహెర్ రమేష్ పంచుకున్న అరుదైన ఫోటోలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. తమ చిన్నతనంలోనూ, రీసెంట్‌గానూ చిరంజీవితో కలసి దిగిన పాత బ్లాక్ అండ్ వైట్ ఫోటో, తాజా ఫొటోనూ.. అలాగే ఇటీవల నాగబాబుతో జ్యోతి దిగిన దృశ్యం, అలాగే జ్యోతి ఆసుపత్రిలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి పరామర్శించిన క్షణాలకు సంబంధించిన ఫోటోలను ఆయన షేర్ చేశారు. మెగా కుటుంబం చూపించిన ఈ ఆప్యాయత, ఇచ్చిన ధైర్యం తమకు కొండంత బలాన్ని ఇచ్చాయని పేర్కొన్నారు. మెహెర్ రమేష్ కుటుంబానికి సినీ వర్గాలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర సానుభూతి తెలియజేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వైఫ్ అన్నా.. ఈ పోస్ట్‌కు స్పందిస్తూ.. జ్యోతి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.

ఇవి కూడా చదవండి:

'ఎల్లమ్మ' నుంచి దేవిశ్రీ ఫ్రంట్ లుక్.. బీజీఎమ్ అదిరింది

King100: నాగ్ వందో సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే

నాటు నాటు పాటకు కీరవాణి డ్యాన్స్.. ఎవరితో కలసి చేశారంటే

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy