Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నాటు నాటు పాటకు కీరవాణి డ్యాన్స్.. ఎవరితో కలసి చేశారంటే

నాటు నాటు పాటకు కీరవాణి డ్యాన్స్.. ఎవరితో కలసి చేశారంటే

Chitrajyothy 3 weeks ago

స్కార్ వేదికపై ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన 'ఆర్‌ఆర్‌ఆర్' (RRR) చిత్రంలోని 'నాటు నాటు' (Naatu Naatu) పాట ఎక్కడ వినబడినా, ఎంతటివారైనా అడుగులు వేయాల్సిందే!

ఈ ప్రపంచ ప్రసిద్ధ ఆస్కార్ విన్నింగ్ సాంగ్‌కు స్వరాలు సమకూర్చిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి (MM Keeravani) తాజాగా తనలోని డాన్సర్‌ను బయటకు తీసి అందరినీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా ఎంతో గంభీరంగా, సైలెంట్‌గా ఉండే కీరవాణి.. ఊహించని విధంగా యంగ్ డాన్సర్లతో కలిసి 'నాటు నాటు' పాటకు హుషారుగా కాలుకదిపి నెటిజన్లను, సినీ ప్రియులను కట్టిపడేశారు.

'ఎత్నిక్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్' (Ethnique Performing Arts) శిక్షణ సంస్థకు చెందిన చిన్నారి నటీనటులు, యంగ్ డాన్సర్లు 'నాటు నాటు' పాటకు ఎంతో ఆవేశంగా, ఉత్సాహంగా పెర్ఫార్మ్ చేస్తున్నారు. అదే సమయంలో అక్కడకు అనూహ్యంగా విచ్చేసిన కీరవాణి, వారి ఎనర్జీని చూసి మురిసిపోయారు. వెంటనే వారితో కలిసి తాను కూడా జాయినై డ్యాన్స్ చేశారు. ఆ పిల్లలతో కలిసి కీరవాణి వేసిన డ్యాన్స్ స్టెప్పులు, ఆయన చూపించిన ఆప్యాయత అక్కడున్న ప్రతిఒక్కరినీ మంత్రముగ్ధులను చేశాయి. ఈ అపూర్వ ఘట్టాన్ని సదరు డ్యాన్స్ అకాడమీ సోషల్ మీడియాలో పంచుకోవడంతో వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది.

Click Here for Video

''మా చిన్నారి కళాకారులు ఎప్పటికీ గుండెల్లో దాచుకునే అద్భుతమైన క్షణం ఇది. వారు 'నాటు నాటు' పాటకు డాన్స్ చేస్తుండగా, ఎం. ఎం. కీరవాణి సర్ స్వయంగా వారితో జాయినై అందరికీ స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. తర్వాతి తరం కళాకారులపై ఆయన చూపించిన ప్రేమ, ఆప్యాయత మరువలేని అనుభూతిని అందించాయి. మా 'ఎత్నిక్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్'లో కేవలం డ్యాన్స్ నేర్పించడమే కాకుండా, ఇలాంటి దిగ్గజాలతో స్టేజ్ పంచుకునే అరుదైన అవకాశాలను, జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను అందిస్తాం'' అని సదరు సంస్థ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. మరో వైపు సంగీత బ్రహ్మ కీరవాణి చిన్న పిల్లలతో అంత సరదాగా గడపడం చూసి ఫ్యాన్స్, నెటిజన్లు ఆయన వినయానికి జేజేలు కొడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

'ఇరుముడి' నుంచి మరో సాంగ్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే

'ఫౌజీ'లో ప్రభాస్ మదర్‌గా ఎవరో తెలుసా..

'వారణాసి' తర్వాత జక్కన్న ప్లాన్ ఏంటి? చిన్న సినిమానా.. లేక

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy