Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'ఎల్లమ్మ' నుంచి దేవిశ్రీ ఫ్రంట్ లుక్.. బీజీఎమ్ అదిరింది

'ఎల్లమ్మ' నుంచి దేవిశ్రీ ఫ్రంట్ లుక్.. బీజీఎమ్ అదిరింది

Chitrajyothy 3 weeks ago

రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) నటుడిగా పరిచయం అవుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఎల్లమ్మ' (Yellamma). ఈ సినిమా ప్రారంభానికి ముందే రకరకాల వార్తలతో ట్రెండ్ అవుతూ వచ్చింది.

ప్రారంభమైన తర్వాత రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్.. సినిమాపై భారీగా క్రేజ్ ఏర్పడేలా చేసింది. అంతేకాకుండా, దేవిశ్రీ ప్రసాద్ ఇటీవల తన స్వగ్రామమైన వేదురుపాకను సందర్శించి, ఈ చిత్రాన్ని ప్రతిబింబించే సంప్రదాయాలు, భావోద్వేగాలు, జాతర సంబరాలలో భాగమవడంతో, ఈ సినిమా కోసం ఆయన ఎంతగా ఇన్‌వాల్వ్ అవుతున్నారనే విషయాన్ని తెలియజేశారు. ఇక గ్లింప్స్‌తో దేవిశ్రీని బ్యాక్ నుంచి మాత్రమే చూపించారు. ఆయన పూర్తి లుక్‌ని ఇప్పటి వరకు మేకర్స్ రివీల్ చేయలేదు. తాజాగా దేవిశ్రీ బర్త్‌డేని పురస్కరించుకుని.. సినిమాలో ఆయన లుక్‌ని మేకర్స్ పరిచయం చేశారు.

ఈ లుక్‌ని పరిచయం చేస్తూ విడుదల చేసిన గ్లింప్స్‌లో బీజీఎమ్ వింటే పూనకాలే. అలా ఉంది బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. ఇక దేవిశ్రీ లుక్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. మరీ ముఖ్యంగా 80స్ నాటి లుక్‌ని తలపిస్తూ పర్షి పాత్రలో ఆయన ఇందులో నటిస్తున్నారనే విషయాన్ని తెలియజేశారు. ఇంకా ఇందులో దేవిశ్రీ రంగస్థల నటుడిగా కనిపించనున్నారనే విషయాన్ని కూడా విడుదల చేసిన పోస్టర్‌తో మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ రాక్‌స్టార్ లుక్‌తో సినిమాపై ఇప్పటి వరకు ఉన్న అంచనాలు రెట్టింపవడం ఖాయం. అలాగే సినిమాపై కూడా బ్లాక్‌బస్టర్ వైబ్ ఏర్పడేలా ఈ పోస్టర్ ఉందంటే అసలు అతిశయోక్తి కానే కాదు. దేవిశ్రీకి పర్ఫెక్ట్ బర్త్‌డే ట్రీట్ అనేలా వచ్చిన ఈ పోస్టర్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నిర్మాత దిల్ రాజు సమర్పణలో, వేణు యెల్దండి (Venu Yeldandi) దర్శకత్వంలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో నిర్మితమవుతూ.. పాన్ ఇండియా సినిమాగా 'ఎల్లమ్మ' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా మేకర్స్ ప్రకటించలేదు. ఈ విషయంలో ఇప్పటి వరకు ఎంతో మంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి కానీ, ఇంతవరకు ఎవరు ఫైనల్ అయ్యారనేది మాత్రం మేకర్స్ రివీల్ చేయలేదు. త్వరలోనే ఆ ప్రకటన కూడా రానుందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

King100: నాగ్ వందో సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే

నాటు నాటు పాటకు కీరవాణి డ్యాన్స్.. ఎవరితో కలసి చేశారంటే

'ఇరుముడి' నుంచి మరో సాంగ్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy