Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Athimanoharam: మోహన్ లాల్ మూవీకి కొత్త సమస్యలు

Athimanoharam: మోహన్ లాల్ మూవీకి కొత్త సమస్యలు

Chitrajyothy 4 days ago

సీనియర్ మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతోంది. అయితే అప్పుడప్పుడూ కొన్ని పరాజయాలు పలకరించిన అవి ఆయన కెరీర్‌ను పెద్దంతగా ఇబ్బంది పెట్టేవి ఏవీ కావు.

ప్రతి చిత్రాన్ని పరిమితమైన బడ్జెట్ లోనే మోహన్ లాల్ చేస్తుంటారు. అయితే అడపాదడపా ఆయన చేసే భారీ చిత్రాలు కొన్ని నిరాశ పరుస్తుంటాయి. ప్రస్తుతం మోహన్ లాల్, మీరా జాస్మిన్ తో కలిసి 'అతిమనోహరం' అనే సినిమా చేస్తున్నారు. మోహన్ లాల్ తో 'తుడరం' చిత్రాన్ని తెరకెక్కించిన తరుణ్‌ మూర్తి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. కొద్ది రోజుల ముందు ఈ సినిమాను ఇదే యేడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు తెలిపారు. అయితే ఇప్పుడు అనుకున్న సమయానికి ఈ సినిమా వస్తుందా? అనే సందేహం తలెత్తుతోంది.

మోహన్ లాల్ 'అతిమనోహరం' షూటింగ్‌ను శబరిమల ప్రాంతంలో చిత్రీకరించాలని మేకర్స్ అనుకున్నారు. అయితే ఇటీవల కేరళ హైకోర్ట్ శబరిమల ప్రాంతంలో ఎలాంటి ఫోటోలు, వీడియోలు తీయకూడదని ఉత్తర్వులు ఇచ్చింది. అంతేకాదు పెరియార్ టైగర్ రిజర్వాయర్ ప్రాంతంలో సినిమాల షూటింగ్స్ కూడా జరపకూడదని తెలిపింది. దాంతో 'అతిమనోహరం' చిత్రానికి చిక్కొచ్చిపడింది. ఇందులోని కొన్ని సన్నివేశాలను శబరిమలలో తీయాలనుకున్న వీరికి తాజా కోర్టు ఉత్తర్వు అడ్డంకిగా మారింది. షూటింగ్‌ జరుపుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేమని సంబంధిత అధికారులు చేతులెత్తేశారు. దాంతో ఇప్పుడీ సినిమాకు సంబంధించిన ఫారెస్ట్ సీన్స్ ను వేరే ఎక్కడైనా తీయాలను ప్లాన్ చేస్తున్నారు. వారు అనుకున్న చోట పర్మిషన్స్ వెంటనే లభిస్తే మంచిదే, అనుకున్నట్టుగానే ఈ సినిమా డిసెంబర్ 24న విడుదల అవుతుంది. లేదంటే వాయిదా పడే ఆస్కారం ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి:

పెళ్ళైన మగాడితో అడ్డంగా దొరికిన ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్...

Balakrishna: 'రాముడు - భీముడు' సినీ నిర్మాత మృతి

ఓటీటీకి వచ్చేస్తోన్న కల్ట్ క్లాసిక్ చెన్నై లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చు అంటే

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy