Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దర్శకుడు మెహర్ రమేష్ కుమార్తె పెళ్లిలో చిరు, వెంకీ, పవన్ సందడి

దర్శకుడు మెహర్ రమేష్ కుమార్తె పెళ్లిలో చిరు, వెంకీ, పవన్ సందడి

Chitrajyothy 3 weeks ago

టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ (Meher Ramesh) ఇంట్లో పెళ్లి వేడుకలు వైభవంగా జరిగాయి. ఆయన కుమార్తె మోహన వివాహం అనిరుధ్‌ (Mohan Anirudh Marriage) అనే అబ్బాయితో హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది.

టాలీవుడ్‌కి చెందిన పలువురు అగ్ర నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, రాజకీయ ప్రముఖుల రాకతో ఈ వివాహ వేడుక కనులపండువగా సాగింది. ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మెహర్ రమేష్ కుటుంబంతో ఉన్న ప్రత్యేక అనుబంధంతో మెగాస్టార్ తన సతీమణి సురేఖతో హాజరవగా, పవన్ కళ్యాణ్ కూడా తన భార్య అన్నాతో ఈ వేడుకలో సందడి చేశారు.

నూతన వధూవరులైన మోహన - అనిరుధ్‌లను చిరంజీవి దంపతులు ఆశీర్వదించి, వారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. మెగాస్టార్ సెలబ్రిటీలతో సందడి చేసిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. చిరంజీవితో ఫొటో దిగేందుకు అంతా ఎగబడటంతో.. కళ్యాణ మండపం వద్ద సందడి నెలకొంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇక ఇదే వేడుకలో వెంకీ మామ కూడా సందడి చేశారు.

ఈ పెళ్లి వేడుకలో విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) ప్రత్యేకంగా నిలిచారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో వెంకటేష్ 'షాడో' అనే మూవీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు నూతన దంపతులను వెంకీ మామ దీవించడమే కాకుండా అక్కడున్న ప్రముఖులతో ఎంతో సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. వెంకటేష్ స్టైలిష్ లుక్, ఆయన నవ్వుతూ అందరినీ పలకరించిన తీరు చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన మరికొన్ని ఫొటోలు, వీడియోలు కూడా నెట్టింట తెగ షేర్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

'జాంబి రెడ్డి 2' ఫస్ట్ షెడ్యూల్ పూర్తి.. దర్శకుడెవరో తెలుసా?

వెంకీ కోసం చేసిన పాటలు.. ఉదయ్ కిరణ్ సినిమాకు వాడేశారు

వైజయంతీ మూవీస్ బ్యానర్ రూటే వేరు.. బ్రాండ్ అంటే ఇది!

PKCW: సినీ ఆశావహులకు పవన్ కళ్యాణ్ బంపర్ ఆఫర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy