Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈ అమ్మాయికి పిలిచి అవకాశం ఇస్తే.. 15 కండీషన్లు పెట్టింది: బన్నీ వాసు

ఈ అమ్మాయికి పిలిచి అవకాశం ఇస్తే.. 15 కండీషన్లు పెట్టింది: బన్నీ వాసు

Chitrajyothy 1 month ago

డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar) నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్, యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ (Bunny Vas) నిర్మాణ సంస్థ బన్నీ వాస్ వర్క్స్..

సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'ఇడుపు కాయితం' (Idupu Kayitham). ప్రియదర్శి (Priyadarshi) హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నటి నాగదుర్గ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఎంటర్‌టైనింగ్ డ్రామాగా ఈ సినిమాను యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి (Vamsi Reddy Dondapati) రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా హైదరాబాద్‌లో జరిగిన పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో నిర్మాత బన్నీ వాసు.. హీరోయిన్ నాగదుర్గ (Nagadurga) గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

''చాలా మంచి కథతో ఈ సినిమా చేస్తున్నాం. సబ్ టైటిల్స్‌తో బీహార్‌లో వేసినా అక్కడ ప్రేక్షకులు కూడా చూసేంత గొప్ప చిత్రమిది. మన అందరి ఇళ్లలో ఒక కామన్ ప్రాబ్లమ్ ఉంటుంది. అదేంటనేది పెళ్లయిన వారికి బాగా తెలుసు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక అమ్మాయి అయితే వాళ్ల అత్తామామను తీసుకుని థియేటర్‌కు వెళ్లండి.. అబ్బాయి అయితే వాళ్ల అత్తామామను తీసుకుని విడిగా థియేటర్‌కు వెళ్లండి. బయటకు వచ్చాక మీ అత్త మీ చేతులు పట్టుకుంటుంది. అల్లుడి చేతులు మామగారు పట్టుకుంటారు. అంతవరకు ఈ కథను చెప్పగలను. ఈ కథ వినగానే ఎంత బిజీగా ఉన్నా సరే.. మేము చేస్తామంటూ నటీనటులందరూ ముందుకు వచ్చారు. ఈ కథే వీళ్లందరినీ ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చింది. జమ్మికుంట నుంచి వచ్చాడు దర్శకుడు వంశీ. నేను ఆ ఊరు వెళ్లలేదు గానీ ఆయన కథ చెబుతుంటే ఆ ఊరు నా కళ్లముందు కనిపించింది. అంత బాగా కథ చెప్పాడు. 'ఇడుపు కాయితం'తో ఒక మంచి తెలుగు సినిమా చూడబోతున్నాం.

నేను, సుకుమార్ కలిసి ఒక సినిమా నిర్మిస్తుంటే.. ఈ సినిమాలో ఎవరైనా సరే.. హ్యాపీగా వచ్చి చేస్తారనుకున్నా. కానీ హీరోయిన్ నాగదుర్గ మాకు 15 కండీషన్స్ పెట్టింది. తెలుగమ్మాయి ఒక సినిమా చేస్తుంటే.. ఏం చేయగలను, ఏం చేయలేను అని ఎంత క్లారిటీగా ఉంటుందనేది నాగదుర్గతో మాట్లాడిన తర్వాత అర్థమైంది. అప్పుడు గుర్తొచ్చింది.. ఒకే, ఐయామ్ డీలింగ్ విత్ ద తెలుగు అమ్మాయి అని. ఈ అమ్మాయి గురించి మేమందరం మారాం. ఎందుకంటే, ఈ అమ్మాయి సినిమాకు అంత ఇంపార్టెంట్. అండ్ 100 పర్సంట్ ఈ అమ్మాయి అయితేనే ఈ సినిమాకి చాలా ప్లస్ అవుతాది. నాగదుర్గ ఇప్పటికే యూట్యూబ్‌లో మంచి పేరు తెచ్చుకుంది. ఆమె కోసం ఒక స్పెషల్ ట్యూన్ చేయిస్తున్నాం. ఆ డ్యాన్స్ నెంబర్‌కు స్క్రీన్స్ చిరిగిపోతాయి. ఈ సినిమా కథను మా వరకు తెచ్చి, మేమంతా కలిసి ఈ మూవీ చేసేలా చేసింది హీరో ప్రియదర్శి. నేను ఈ మూవీ చేయకపోయి ఉంటే ఒక మంచి కథను మిస్ అయ్యేవాడిని. రైట్ టైమ్‌లో నా దగ్గరకు వచ్చిన రైట్ ప్రాజెక్ట్ ఇది..'' అని బన్నీ వాసు చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

Tollywood: పర్శంటేజ్‌ పై ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ షరతులు!

లీగల్ వివాదంలో ప్రభాస్ 'స్పిరిట్'.. టైటిల్ మార్చాల్సిందేనా?

'పెద్ది' సక్సెస్ చూసి నాకు 'ఠాగూర్'లోని డైలాగ్ గుర్తొచ్చింది: రామ్ చరణ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy