Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మలయాళ బాట పట్టిన కెనీషా!

మలయాళ బాట పట్టిన కెనీషా!

Chitrajyothy 3 weeks ago

ప్రముఖ గాయని, 'జయం' రవి ఒకప్పటి స్నేహితురాలు కెనీషా ఇటీవల సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చూసి చాలామంది నిరాశకు గురయ్యారు. గాయనిగా తన కెరీర్‌కు ఫుల్ స్టాప్ పెట్టేసి, ఆమె ముంబై వెళ్ళిపోతోందని బాధ పడ్డారు.

తనకు ఇష్టమైన వ్యక్తిని వదిలి వెళ్ళిపోతున్నానని, అతనికి నాకు ఇక సంబంధం లేదని ఆమె రాసిన రాతలు చూసి అవాక్కయ్యారు. అయితే... కెనీషా... రవి జీవితంలోంచి వెళ్ళిపోయింది తప్పితే సంగీతాన్ని వదిలేయలేదు. విశేషం ఏమంటే... ఇప్పుడు ఆమె మరింత ఫోకస్డ్ గా వర్క్ చేస్తోంది. తాజాగా మలయాళ సినిమా రంగంలోకీ గాయనిగా అడుగుపెడుతోంది. 'మడ్‌ ఫిష్‌' అనే సినిమాలో ఆమె పాట పాడుతోంది.

ఇప్పటికే ఇండిపెండెంట్‌ మ్యూజిక్‌ రంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న కెనీషా 'మడ్‌ ఫిష్‌' మలయాళ మూవీలో పాట పాడి మరో కొత్త అధ్యాయానికి తెర తీసింది. ఇది ఆమె సంగీత ప్రయాణంలో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది. అర్థవంతమైన సంగీతాన్ని సృష్టించాలనే తపనతో ఆమె నిరంతరం కళాకారిణిగా ఎదుగుతూ, భిన్న పరిశ్రమలు, భాషల్లో కొత్త అవకాశాలను స్వీకరిస్తోంది. దానికి ఇది తాజా ఉదాహరణ. జితిన్ ఐజాక్ థామస్ దర్శకత్వం వహిస్తున్న 'మడ్ ఫిష్' చిత్రంలో సన్నీ వేన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆసక్తికరమైన కథనం, సున్నిత భావోద్వేగాలతో కూడిన కథ కారణంగా ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. సంగీతం ఈ చిత్ర భావోద్వేగ ప్రయాణంలో కీలక పాత్ర పోషించనుండగా, కెనీషా గాత్రం ఆ సంగీతానికి ప్రత్యేకమైన భావవ్యక్తీకరణను జోడించనుంది. దీంతో ఆమె అరంగేట్రం సంగీతాభిమానులకు మరింత ప్రత్యేకంగా మారనుంది. మరి ఈ సినిమా తర్వాత కెనీషాకు మరిన్ని అవకాశాలు గాడ్స్ ఓన్‌ కంట్రీలో లభిస్తాయేమో చూడాలి.

ఇవి కూడా చదవండి:

Nandu's World: ఇన్ ఫ్లుయెన్సర్ వీసాల దందా... ఖండించిన నందు!

I MAX: హైదరాబాద్‌కు.. ఐమాక్స్ వచ్చేస్తోంది

మైథలాజికల్‌ ఫాంటసీ 'జటాయు' వర్కౌట్‌ అవుతుందా!?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy