Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మేము అమ్మ, నాన్నలమయ్యాం: జబర్దస్త్ నటుడు ఎమోషనల్!

మేము అమ్మ, నాన్నలమయ్యాం: జబర్దస్త్ నటుడు ఎమోషనల్!

Chitrajyothy 1 week ago

బుల్లితెర ప్రముఖ హాస్యనటుడు, 'జబర్దస్త్' ఫేమ్ కెవ్వు కార్తీక్ (Karthik Kevvu) తండ్రయ్యాడు. ఆయన భార్య శ్రీలేఖ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

ఈ విషయాన్ని కార్తీక్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఎంతో భావోద్వేగానికి లోనయ్యాడు. 'మేము అమ్మ, నాన్న అయ్యాం.. చిరునవ్వుల చిన్నారి పాదాలు మా జీవితంలోకి అడుగుపెట్టి, మా ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చేశాయి' అంటూ తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు. ప్రస్తుతం తల్లీ, బిడ్డ ఇద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు కార్తీక్ పేర్కొన్నాడు.

జీవితంలో ఒక విషాదం జరిగిన చోటే, దేవుడు మరో అద్భుతాన్ని చూపిస్తాడనడానికి ఈ ఘటనే నిదర్శనమని కార్తీక్ భావోద్వేగపూరిత పోస్ట్ పెట్టాడు. ''జీవితాన్ని దారిలో పెట్టడానికి దైవానికి ఒక మార్గం ఉంటుంది. మాకు దిశానిర్దేశం చేసిన మా అమ్మను కోల్పోయిన సరిగ్గా రెండేళ్లకు, మా జీవితాల్లోకి సరికొత్త వెలుగు వచ్చింది'' అని రాసుకొచ్చాడు. తల్లిని కోల్పోయిన కార్తీక్, మళ్లీ తన పాప రూపంలో అమ్మ ఇంట్లోకి వస్తున్నట్లుగా భావిస్తూ.. కార్తీక్ దంపతులు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

''మా జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఇంతకంటే ఆశీర్వాదం ఇంకేముంటుంది'' అని పేర్కొన్న కార్తీక్, తన అభిమానులకు ఒక చిన్న పజిల్ కూడా విసిరాడు. ''మా ఇంటికి వచ్చింది చిన్న రాజకుమారుడా (బాబు) లేదా చిన్న రాజకుమారినా? (పాప) అనేది మీరు గెస్ చేయగలరా?'' అంటూ ఒక ఆసక్తికరమైన ప్రశ్నను జోడించాడు. దీంతో నెటిజన్లు, తోటి జబర్దస్త్ కళాకారులు కార్తీక్ దంపతులకు పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. విషయం ఏమిటంటే.. రెండేళ్ల క్రితం కార్తీక్ తన తల్లిని కోల్పోయిన విషయం తెలిసిందే. ఇక్కడే హింట్ ఇచ్చేసి.. మళ్లీ పజిల్ ఎందుకనేది ఆయనే తెలియాలి. త్వరలోనే తనకు ఎవరు పుట్టారో రివీల్ చేస్తానంటూ నెటిజన్లకు కార్తీక్ కామెంట్స్‌లో తెలుపుతున్నారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి:

Mega158: మాస్ వర్కవుట్స్‌తో మెగా158 అప్డేట్.. చిరు వీడియో వైరల్!

లేటు వయసులో ఖరీదైన 'పోర్షే' లగ్జరీ కారు.. సీనియర్ నరేశ్ జల్సానే జల్సా! ఖరీదెంతో తెలుసా?

Chiranjeevi: 'పెద్ది' ట్రైలర్ చూశా.. ఒక్కొక్కరు రఫ్ఫాడించేశారు!

Keneeshaa: 4 నెలల బిడ్డను కోల్పోయిన నేను.. జయం రవి జీవితం నాశనం చేస్తానా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy