Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ 'అగధ' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ 'అగధ' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Chitrajyothy 3 weeks ago

ర్శకుడు ఎం.ఎస్. రాజు (MS Raju) దర్శకత్వంలో రూపొందిన మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ 'అగధ' (Agadha). ఈ సినిమాపై ప్రేక్షకుల్లో రోజురోజుకీ ఎలా ఆసక్తి పెరుగుతుందో తెలియంది కాదు.

ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌.. మంచి స్పందనను రాబట్టుకోవడంతో పాటు, సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. రీసెంట్‌గానే చిత్ర ప్రమోషన్స్ జాతరను బల్కంపేట ఎల్లమ్మ-పోచమ్మ అమ్మవార్ల ఆశీస్సులతో మేకర్స్ ప్రారంభించారు. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ (Agadha Trailer)ను విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారిక ప్రకటనను విడుదల చేశారు.

ఈ చిత్ర ట్రైలర్‌ను ఆగస్ట్ 3న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్లుగా తెలుపుతూ ఓ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌ని గమనిస్తే.. అడవి నడుమ మర్మమైన వాతావరణంలో నిలబడి ఉన్న ఓ స్త్రీ సాధువు రూపం.. సినిమా కథలో దాగి ఉన్న రహస్యాలపై మరింతగా ఆసక్తిని పెంచుతోంది. 'అగధ' ప్రేక్షకులను ఓ విభిన్నమైన ఆధ్యాత్మిక మిస్టరీ ప్రపంచంలోకి తీసుకెళ్లబోతుందనే సంకేతాలను ఈ పోస్టర్ ఇస్తుందనడంలో సందేహమే లేదు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ LLP బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. అజయ్ కె.ఆర్. సమర్పిస్తున్నారు. కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను ఎం.ఎస్. రాజు నిర్వహిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందిన ఈ పాన్ ఇండియా చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్‌తో సంచలనం సృష్టించిన ఈ చిత్రం.. ఇప్పుడు ట్రైలర్‌తో అంచనాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని చిత్రబృందం నమ్మకంగా చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

Karmaakhya Movie reveiw: కర్మాఖ్య మూవీ రివ్యూ

సైమా 14వ ఎడిషన్‌ నామినేషన్స్‌లో ఈ తెలుగు చిత్రాలదే హవా..

మహేష్ సినిమాలో విలన్‌గా చేయాలని ఉంది: సుమంత్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy