Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
MS Raju: 'ఒక్కడు'కు మహేష్, 'వర్షం'కు ప్రభాస్.. మరి 'అగధ'కు?

MS Raju: 'ఒక్కడు'కు మహేష్, 'వర్షం'కు ప్రభాస్.. మరి 'అగధ'కు?

Chitrajyothy 2 weeks ago

ఎం.ఎస్. రాజు (MS Raju) ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఒకప్పుడు స్టార్ హీరోలతో బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించిన ఈ నిర్మాత.. ఇప్పుడు దర్శకుడిగానూ తన సత్తా చాటుతున్నారు.

ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'అగధ' (Agadha) చిత్రం ఆగస్ట్ 14న భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ. దర్శకుడు ఎం.ఎస్. రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

''మా 'అగధ' ట్రైలర్ లాంచ్ వేడుకకు వచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. అజయ్, కాశీ విశాలాక్షి ఈ ప్రయాణంలో నాకెంతో సపోర్ట్ చేశారు. 'ఆరిజిన్ ఆఫ్ అగధ' కూడా చాలా వైరల్ అయింది. మున్ముందు ఈవెంట్లలో టీం అందరి గురించి చెబుతాను. ఆగస్ట్ 14న 'అగధ' రిలీజ్ కాబోతోంది. అది నాకు చాలా మంచి డేట్ అనిపిస్తోంది. ఆ డేట్‌కి వచ్చే ప్రతీ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మంచి కంటెంట్‌తో వచ్చే ప్రతీ చిత్రాన్ని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు. 'అగధ' సినిమాను అంత సులభంగా తెరకెక్కించలేరు. విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ వంటివి ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఈ మూవీని ఏడాదిలోనే పూర్తి చేశాం. రాకేష్ ఈ మూవీకి అద్భుతమైన స్కోర్ ఇచ్చారు. పూర్తిగా భక్తిరస చిత్రాన్ని తీసినా కష్టమే అవుతుంది. యూత్, జెన్ జీ ఆడియెన్స్‌ని ఆకట్టుకునే అన్ని రకాల అంశాలను ఇందులో పొందుపరిచాం. నాకు రిటైర్ అవ్వడం అనేది ఇష్టం ఉండదు. నా శ్వాస ఉన్నంత వరకు సినిమాలు తీస్తూనే ఉంటాను.

కథకి ఎవరు నప్పుతారు అనేది చూసుకుని.. ఆర్టిస్టుల్ని సెలెక్ట్ చేసుకుంటాను. 'అగధ' కోసం అద్భుతమైన ఆర్టిస్టులను ఎంపిక చేసుకున్నాను. ఇంతకు ముందు నేను చేయని కథలను.. జానర్స్‌ని ఇప్పుడు ట్రై చేయాలని అనుకుంటున్నాను. చిన్నప్పుడు నాకు గాలి సోకిందని కొన్ని రోజుల పాటు స్కూల్‌కి వెళ్లకుండా మాన్పించారు. ఆ సంఘటన నా మదిలో అలా ఉండిపోయింది. అది కూడా ఈ 'అగధ' చేయడానికి ఒక కారణమని చెప్పుకోవచ్చు. అందరూ మా సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాను. అన్ని భాషల్లో డబ్బింగ్ రెడీ చేసి పెట్టాం. కానీ ముందు తెలుగు మీద ఫోకస్ పెట్టమని అంతా సలహా ఇచ్చారు. అందుకే అన్ని చోట్లకు వెళ్లి హడావిడిగా ప్రమోషన్స్ చేయడం లేదు. ముందు మా మూవీ గురించి తెలుగు ఆడియెన్స్ మాట్లాడాలి. కొన్ని స్క్రీన్‌లలోనే వేద్దామని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ అన్నారు. అతనికి పూర్తి చిత్రాన్ని చూపించాను. దాంతో ఓవర్సీస్‌లో ఆయనే భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చారు.

'ఒక్కడు' సినిమాకి మహేష్ బాబు, 'వర్షం'కి ప్రభాస్, 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'కి సిద్ధార్థ్, 'మనసంతా నువ్వే'కి ఉదయ్ కిరణ్ కరెక్ట్‌గా సెట్టయ్యారు. ఇప్పుడు 'అగధ' మూవీకి ఇందులో నటించిన వారంతా కరెక్ట్ అని నేను చెప్పగలను. శ్రవణ్, కామాక్షి, జోవికా, ఉల్కా అందరూ అద్భుతంగా నటించారు. 'అగధ'లో అద్భుతమైన కథతో పాటు స్క్రీన్‌ప్లే కూడా చాలా కొత్తగా ఉంటుంది. ప్రతీ రోజూ ఉదయం మూడు గంటలకు నిద్ర లేచి స్క్రిప్ట్ రాసేవాడిని. ఆ కష్టమే మంచి ఫలితాన్ని ఇస్తుందని నమ్ముతున్నాను'' అని చెప్పుకొచ్చారు. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

'వారణాసి'.. జక్కన్న ఇచ్చిన మాస్ అప్‌డేట్ ఇదే!

కీర్తి రెడ్డితో విడాకులకు కారణమిదే: సుమంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

జానీ మాస్టర్ వైఫ్ సుమలత తీరుపై ఫెడరేషన్, నిర్మాతలు తీవ్ర ఆగ్రహం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy