Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నందమూరి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎస్వీబీసీ ఛైర్మన్‌గా శ్రీధర్ వర్మ ప్రమాణ స్వీకారం

నందమూరి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎస్వీబీసీ ఛైర్మన్‌గా శ్రీధర్ వర్మ ప్రమాణ స్వీకారం

Chitrajyothy 16 hrs ago

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)కి చెందిన శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ (ఎస్వీబీసీ) నూతన ఛైర్మన్‌గా శ్రీధరవర్మ (Sreedhar Varma) బాధ్యతలు స్వీకరించారు.

అలిపిరి సమీపంలోని ఎస్వీబీసీ కార్యాలయంలో నందమూరి కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కూటమి నేతలు శ్రీధరవర్మను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్వీబీసీ (SVBC) ఛైర్మన్‌గా అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని శ్రీధరవర్మ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా శ్రీధరవర్మ మాట్లాడుతూ.. శ్రీవేంకటేశ్వర స్వామి ఖ్యాతిని, హిందూ ధర్మాన్ని ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చేయడంలో ఎస్వీబీసీ కీలక పాత్ర పోషిస్తోంది. ఉద్యోగులందరితో సమన్వయంతో కలిసి పనిచేసి, నా వంతు బాధ్యతని నిర్వహిస్తాను. నాకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలకు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులు నందమూరి మోహన్ కృష్ణ, నందమూరి రామకృష్ణ, నందమూరి మోహన రూప, కామినేని సీమంతిని, దగ్గుబాటి నివేదిత, ఏపీ ఎఫ్ డి సి చైర్మన్ భరత భూషణ్, తెలుగు చిత్ర నిర్మాతల మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్ హాజరై శ్రీధర్ వర్మకు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా నందమూరి మోహనకృష్ణ మాట్లాడుతూ.. నా సోదర సమానుడు శ్రీధర్ వర్మ ఎస్వీబీసీ చైర్మన్‌గా ఎంపికైనందుకు నా శుభాకాంక్షలు. రక్తం పంచుకుని పుట్టకపోయినా ఆప్యాయత అనురాగాలలో నాకు మా సోదరుడు ఎలాగో, రాజు గారి పిల్లలు కూడా అంతే. నాడు నాన్న తొలి పార్టీ టికెట్ రాజు గారికి ఇచ్చినప్పటికీ ఆయన తనకు టికెట్ వద్దు అని అనడంతో.. శ్రీవారి సేవలో ఉండాలంటూ నాన్నగారి కోరికను కాదనకుండా టీటీడీ కోసం పనిచేశారు. అభివృద్ధి కోసం ఆయన స్వయంగా ముందుకు వచ్చి తన భూమిని దానం చేశారు. నాన్నగారి తరం నుంచి ఆ కుటుంబం మాకు అండగా ఉన్నారు. అటువంటి రాజుగారి కుమారుడు నేడు తన వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ టీటీడీ ఎస్వీబీసీ చైర్మన్‌గా ఎంపికైనందుకు చాలా సంతోషం ఉందన్నారు. నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ.. ''నాన్న ఎన్టీఆర్‌గారి అభిమాని ఎన్టీఆర్ రాజుగా ప్రసిద్ధి చెందిన రాజు కుమారుడు శ్రీధర్ వర్మ నేడు ఈ పదవికి ఎంపికైనందుకు మా కుటుంబ సభ్యులకు ఆనందకరం. ఆయన దీనికి అర్హుడు. గత నాలుగు తరాలుగా ఆ కుటుంబం స్వామివారి సేవలో ఉన్నారు. ఎన్టీఆర్ రాజు చాలా నమ్మకంగా ఉండేవారు, స్వామివారి విషయంలో బాగా స్ట్రిక్ట్‌గా ఉండేవారు. అటువంటి మహానుభావుడు కొడుకు శ్రీధర్ వర్మ ఆయన బాటలో నడుస్తూ ఎస్వీబీసీ ఛానల్‌ను మరింత ఉన్నత స్థానానికి తీసుకువెళ్తారని నమ్ముతున్నానని తెలిపారు. 'విలువలతో కూడిన వ్యక్తి రాజు పెదనాన్న. అలాంటి అరుదైన వ్యక్తి కుమారుడు మా అన్నయ్య శ్రీధర్ వర్మ నేడు ఎస్వీబీసీ చైర్మన్‌గా ఎంపికైనందుకు సంతోషంగా ఉంది' అని తెలిపారు నందమూరి మోహన రూప.

ఇవి కూడా చదవండి:

'జనవరి 12 విడుదల'.. అనిల్ ఇవ్వబోతోన్న స్పెషల్ సర్‌ప్రైజ్ ఏంటి?

ఐకాన్ స్టార్ 'రాకా' చుట్టూ ఇంత రహస్యం ఎందుకు?

బాక్సాఫీస్ వద్ద 'ఇరుముడి' విధ్వంసం.. 2 డేస్ కలెక్షన్స్ ఎంతంటే

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy