Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నిన్న రిజిస్టర్ మ్యారేజ్.. నేడు సంప్రదాయం ప్రకారం ఫైమా పెళ్లి

నిన్న రిజిస్టర్ మ్యారేజ్.. నేడు సంప్రదాయం ప్రకారం ఫైమా పెళ్లి

Chitrajyothy 1 month ago

బుల్లితెరపై స్టార్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న లేడీ కమెడియన్ ఫైమా (Faima) గత రెండు రోజులుగా వార్తలలో హైలెట్ అవుతోన్న విషయం తెలిసిందే. దాదాపు 9 సంవత్సరాల నుంచి తను ప్రేమిస్తున్న ప్రియుడు ప్రవీణ్ నాయక్‌ (Praveen Nayak)కు బుధవారం ఫైమా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని, వివాహబంధంలోకి అడుగుపెట్టారు.

వాస్తవానికి జబర్దస్త్‌లో తన పెయిర్‌గా నటించిన ప్రవీణ్‌ని ఫైమా పెళ్లి చేసుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ ఆ ప్రవీణ్‌తో రిలేషన్ బెడిసికొట్టడంతో.. అదే పేరుతో ఉన్న మరో ప్రవీణ్‌ను వివాహం చేసుకుని షాకిచ్చింది. జబర్ధస్త్ ప్రవీణ్‌తో ఫైమా ఎందుకు విడిపోయిందనేది ఇంత వరకు కారణం తెలియదు కానీ, ఇద్దరూ ఒకరిని మించి మరొకరు మోసం చేశారనేలా ఆరోపణలైతే చేసుకున్నారు.

ఇక బుధవారం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ఫైమా.. గురువారం (జూన్ 25) బంధుమిత్రుల సమక్షంలో సంప్రదాయంగా పెళ్లి చేసుకుని మరోసారి వార్తలలో నిలిచారు. తాజాగా ఫైమా, ప్రవీణ్ నాయక్ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పెళ్లి వేడుకలో ఫైమా కన్నీటిపర్యంతమైంది. తన కుటుంబానికి సంబంధించిన పెద్దలెవరూ ఈ పెళ్లికి అంగీకారం తెలపలేదనేలా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తన పెళ్లి సమయంలో తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ లేకపోవడంతో.. ఫైమా తీవ్ర భావోద్వేగానికి లోనైనట్లుగా తెలుస్తోంది. ఇక ఈ పెళ్లికి పటాన్ ప్రవీణ్‌తో పాటు మరికొందరు సెలబ్రిటీలు హాజరై, నూతన జంటను ఆశీర్వదించారు.

ఫైమా, ప్రవీణ్ నాయక్‌ల ప్రేమ విషయానికి వస్తే.. తొమ్మిదేళ్లుగా సాగుతున్న వీరి సీక్రెట్ లవ్ స్టోరీకి ఎన్నో అడ్డంకులు, విమర్శలు ఎదురైనప్పటికీ.. వాటన్నింటినీ ఎదిరించి చివరికి ఇలా ఈ జంట ఒక్కటయ్యారు. అంతకు ముందు రిజిస్టర్ మ్యారేజ్ అనంతరం ఫైమా చేసిన పోస్ట్ వారి ప్రేమ ఎంత గొప్పదో తెలియజేస్తోంది. ''మమ్మల్ని ఎంతగానో అనుమానించారు.. జడ్జ్ చేశారు.. విడదీయాలని ప్రయత్నించారు. కానీ ప్రతి అడ్డంకి కంటే మా ప్రేమే చాలా బలంగా నిలిచింది. మేము ప్రతిరోజూ ఒకరి కోసం మరొకరం నిలబడ్డాం. ఈ రోజు మేము భార్యాభర్తలం'' అంటూ ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది.

ఇవి కూడా చదవండి:

ఈ అమ్మాయికి పిలిచి అవకాశం ఇస్తే.. 15 కండీషన్లు పెట్టింది: బన్నీ వాసు

Tollywood: పర్శంటేజ్‌ పై ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ షరతులు!

లీగల్ వివాదంలో ప్రభాస్ 'స్పిరిట్'.. టైటిల్ మార్చాల్సిందేనా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy