Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'OG 2'లో ఊహించని మార్పులు.. షూటింగ్ డేట్ ఫిక్స్!

'OG 2'లో ఊహించని మార్పులు.. షూటింగ్ డేట్ ఫిక్స్!

Chitrajyothy 3 days ago

వర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), యువ సంచలనం సుజీత్ (Director Sujeeth) కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఓజీ' (OG Movie) బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో తెలియంది కాదు.

ఒక అభిమాని అయిన దర్శకుడు తన హీరోని వెండితెరపై ఎలా చూపించాలో.. సుజీత్ అంతకుమించి పవర్ స్టార్‌ను ఆవిష్కరించాడు. పవన్ కళ్యాణ్‌ను చూపించిన విధానం, ఆయనకు ఇచ్చిన మైండ్ బ్లోయింగ్ మాస్ ఎలివేషన్లు థియేటర్లలో పూనకాలు తెప్పించాయి. ఇక థమన్ అందించిన పాటలతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లను దద్దరిల్లేలా చేసి, అభిమానుల చేత విజిల్స్ వేయించాయి. దీంతో 'ఓజీ-2'పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌తో పాటు సాధారణ సినీ ప్రేక్షకుల్లోనూ భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందా? అని అందరూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మోస్ట్ అవేటెడ్ సీక్వెల్‌కు సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండటంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.

ఇటీవల 'ఓజీ 2' ప్రాజెక్ట్‌పై పవన్ కళ్యాణ్ టీమ్ నుంచి పరోక్షంగా కొన్ని క్రేజీ సంకేతాలు రావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న దర్శకుడు సుజీత్ త్వరలోనే ఇండియాకు తిరిగి రానున్నట్లు సమాచారం. ఆయన వచ్చిన వెంటనే పవర్ స్టార్‌ను కలవబోతున్నారట. వీరిద్దరి మధ్య జరగబోయే కథా చర్చల్లో సీక్వెల్ స్క్రిప్ట్‌కు తుది రూపు ఇవ్వనున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే, వచ్చే సెప్టెంబర్‌లో ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రానుంది. అంతేకాదు, నవంబర్ నుంచే ఈ క్రేజీ సీక్వెల్ రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు చిత్రబృందం పక్కా ప్లాన్‌తో ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే 'ఓజీ 2'కు సంబంధించి ఫిల్మ్ నగర్‌లో మరో ఆసక్తికరమైన వార్త గట్టిగా చక్కర్లు కొడుతోంది. 'ఓజీ' మొదటి భాగాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. కానీ, ఈ సీక్వెల్ విషయంలో నిర్మాణ భాగస్వామ్యంలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయట. తాజా సమాచారం ప్రకారం.. పవన్ కళ్యాణ్ సొంత నిర్మాణ సంస్థ అయిన 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్'తో పాటు టాలీవుడ్‌కు చెందిన మరో టాప్ ప్రొడక్షన్ హౌస్ ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ అగ్ర నిర్మాణ సంస్థ ఏదనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అయినప్పటికీ, త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. 'ఓజీ' మొదటి భాగంలో పవన్ కళ్యాణ్ లుక్, గన్ ఫైట్స్, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ఇప్పుడు పార్ట్-2 వస్తుండటంతో, సుజీత్ అంతకుమించిన హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులు, ఊహించని మాస్ ఎలివేషన్లను ప్లాన్ చేస్తున్నారట. పవర్ స్టార్‌ను సరికొత్త కోణంలో, మరింత పవర్‌ఫుల్‌గా చూపించేందుకు సుజీత్ గట్టి కసరత్తులే చేస్తున్నారు. మరి 'ఓజీ 2'తో పవర్ స్టార్ - సుజీత్ కాంబో బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి!.

ఇవి కూడా చదవండి:

పవన్ అభిమాని నిరంజన్‌ను ఈ రోజే కలవడానికి కారణమిదే: బండ్ల గణేష్

మాట నిలబెట్టుకున్న థమన్‌.. ఎంత గొప్ప మనసో!

రుక్మిణి వసంత్‌ మార్ఫింగ్ ఫొటోలు.. ముగ్గురు అరెస్ట్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy