Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రకాష్ రాజ్.. ఎందుకింత ఓవరాక్షన్ చేస్తున్నావ్?: బండ్ల గణేష్

ప్రకాష్ రాజ్.. ఎందుకింత ఓవరాక్షన్ చేస్తున్నావ్?: బండ్ల గణేష్

Chitrajyothy 3 weeks ago

ప్రకాష్ రాజ్‌ (Prakash Raj) పై మరోసారి బండ్ల గణేష్ (Bandla Ganesh) ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ.. నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన సీరియస్ అయ్యారు.

'నీ ఓవరాక్షన్ చూడలేకపోతున్నాం.. అవసరానికి మించి అతిగా ప్రవర్తించడం గొప్పతనం కాదు.. హద్దులు దాటి ప్రవర్తిస్తే.. నీపై ఉన్న గౌరవం కూడా పోతుంది' అంటూ బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనికి నెటిజన్లు కూడా ఆయనకు సపోర్ట్ ఇస్తున్నారు. గతంలో చాలా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు లేవని నోరు.. ఇప్పుడు కేవలం ఈ 'రావణ్' విషయంలో మాత్రమే ఎందుకు లేస్తుంది? అంటూ ప్రశ్నిస్తున్నారు. అసలింతకీ బండ్ల గణేష్ ఏం ట్వీట్ చేశారంటే..

''నువ్వు ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావో అర్థం కావడం లేదు. ఎవరి మెప్పు కోసం ఈ డ్రామా? ముందు నీ స్థాయి, నీ బాధ్యత, నీ వ్యక్తిత్వం ఏమిటో ఒకసారి అద్దంలో చూసుకుని, నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో. అవసరానికి మించి అతిగా ప్రవర్తించడం గొప్పతనం కాదు. ప్రపంచాన్ని నువ్వే నడిపిస్తున్నట్టు, దేశ భవిష్యత్తు అంతా నీ భుజాల మీదే ఉన్నట్టు ప్రవర్తించడం హాస్యాస్పదంగా ఉంది. నీ అహంకారం, నీ అతి చూసి.. జాలి కంటే అసహ్యమే ఎక్కువగా కలుగుతోంది. కాస్త వినయం నేర్చుకో. హద్దులు దాటి ప్రవర్తిస్తే గౌరవం పెరగదు, ఉన్న గౌరవం కూడా పోతుంది'' అంటూ ప్రకాష్ రాజ్‌ని ఉద్దేశిస్తూ.. బండ్ల గణేష్ హితవు చెప్పారు.

''ఏంటీ నాటకం, దౌర్జన్యం? ఒక కేసులో అరెస్ట్ చేస్తారు.. కోర్టు బెయిల్ ఇస్తుంది. మళ్లీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారు.. మళ్లీ కోర్టు బెయిల్ ఇస్తుంది. ఇలా వరుసగా అరెస్ట్ చేయడం, కోర్టులు బెయిల్ ఇవ్వడం చూస్తుంటే కోర్టు ఏం చెబుతోందో మీకు అర్థం కావడం లేదా? మీరు పెడుతున్నవి తప్పుడు కేసులు, అరెస్ట్ చేయొద్దని కోర్టులు చెబుతున్నా వినరా? ఇదేనా ప్రజాస్వామ్యం? ప్రజల కోసం ఇందుకేనా అధికారంలోకి వచ్చింది? ఏంటీ కక్ష సాధింపు?.. ఇంత ఓపెన్‌గా, ఇంత సిగ్గు లేకుండా, ఇంత అహంకారమా? దేశం మొత్తం ఈ పరిణామాలను చూస్తోంది. మీరు చేస్తోంది ముమ్మాటికీ తప్పు. వుయ్ విల్ స్టాండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్'' అని ప్రకాష్ రాజ్ చెబుతున్న వీడియోకు బండ్ల గణేష్ పై విధంగా రియాక్ట్ అయ్యారు.

ఇవి కూడా చదవండి:

ఇంకా మొదలెట్టకుండానే.. కాంట్రవర్సీలో 'గాడ్ ఆఫ్ వార్'

ప్రభాస్‌తో 'ధురంధర్' దర్శకుడి మూవీ.. అధికారిక ప్రకటన ఆరోజేనా!

ప్రశ్నించడం అంటే ఇదేనా? రావణ్‌పై రామ్ తాళ్లూరి ఫైర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy