Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'తమ్ముడు' టైమ్‌లో పుట్టా.. అందుకే పవన్ కళ్యాణ్ అని పేరు!

'తమ్ముడు' టైమ్‌లో పుట్టా.. అందుకే పవన్ కళ్యాణ్ అని పేరు!

Chitrajyothy 1 week ago

త్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న 'పురుష:' (Purushaha Movie) అనే చిత్రంతో పవన్ కళ్యాణ్ బత్తుల (Pavan Kalyan Bathula) హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.

ఈ సినిమాను వీరు వులవల (Veeru Vulavala) దర్శకత్వంలో బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌ వంటి వారంతా ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తోన్న ఈ మూవీని మే 22న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్‌ను యమా జోరుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా చిత్ర హీరో పవన్ కళ్యాణ్ బత్తుల, మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

''మాది పల్నాడులోని మాచర్లకు దగ్గరున్న కారంపూడి. మాకు సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి రిలేషన్ లేదు. మా నాన్న కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ఉన్నారు. మా నాన్నకి నచ్చకుండా నేను ఏ పనీ చేయను. నాకు నచ్చని ఏ పని కూడా మా నాన్న చేయరు. మా బాండింగ్ అలా ఉంటుంది. మా నాన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని. ఆయన మొదటి సినిమా నుంచి ఏదీ మిస్ కాలేదు. 'తమ్ముడు' సినిమా టైమ్‌లో నేను పుట్టాను. ఆయన మీద ఉన్న అభిమానంతో నాకు పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టారు. నన్ను హీరో చేయాలన్నది నాన్న కల. నాకు కూడా సినిమాలంటే చాలా ఇష్టం. అలా సినిమా ఇండస్ట్రీ వైపు అడుగుపడింది. వైజాగ్‌లో సత్యానంద్ సార్ వద్ద యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్నాను. సర్ ఉండే కమ్యూనిటీలోనే నేను కూడా ఉన్నాను. నాలుగు నెలలు ఆయనతోనే కలిసి ఉన్నాను. ఆయన ట్రైనింగ్ మాత్రమే ఇస్తారు తప్పితే.. రికమెండ్ చేయరు. ఆయన వద్ద నేను ఎంతో నేర్చుకున్నాను.

డీఓపీ సతీష్ వల్లే ఈ ప్రాజెక్ట్ మా దగ్గరకు వచ్చింది. సినిమాలతో ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందించాలని అనుకున్నాం. అందుకే నా మొదటి మూవీగా ఇలాంటి ఓ ఫ్యామిలీ కథతో వస్తున్నాను. ఫ్యామిలీ ఆడియెన్స్‌కి నచ్చేలా 'పురుష:' మూవీని రూపొందించాం. ఓ మంచి చిత్రాన్ని చూశామన్న ఫీలింగ్‌తో ప్రేక్షకులు థియేటర్స్ నుంచి బయటకు వస్తారని నమ్మకంగా చెప్పగలను. ఇందులో చాలా మంది సీనియర్ ఆర్టిస్టులున్నారు. అందరూ నాకు ఎంతో సహకరించారు. మరీ ముఖ్యంగా సప్తగిరి అన్న, కసిరెడ్డి అన్న ప్రతీ విషయంలో హెల్ప్ చేశారు. అందరి సహకారంతోనే సినిమాని చేయగలిగాను.

ఇందులోని అన్ని పాత్రలకు సమానమైన ప్రాధాన్యం ఉంటుంది. 'క్షేమంగా వెళ్లి లాభంగా రండి' సినిమాని ఆడియెన్స్ ఎంత ఎంజాయ్ చేశారో.. మా సినిమాతో కూడా అంతే ఎంజాయ్ చేస్తారు. ప్రతీ సీన్‌ను ఎంతో కేర్ తీసుకుని చేశాం. ఈ ప్రయాణంలో సినిమా ఆర్టిస్టుల కష్టాలన్నీ నాకు తెలిశాయి. దర్శకుడు వీరు అన్న నాకు ఎంతగానో సపోర్ట్ ఇచ్చారు. నేను చాలా ఇంట్రోవర్ట్‌గా ఉండేవాడిని. నన్ను నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకు వచ్చి, ఆయనకు కావాల్సిన యాక్టింగ్ రాబట్టుకున్నారు. ఈ సినిమా జర్నీలో మా సోదరి సరస్వతి ఇచ్చిన సపోర్ట్ మరిచిపోలేను. ఆమె పెళ్లైంది. ఇద్దరు బిడ్డలు కూడా ఉన్నారు. మా సిస్టర్‌కి నేనంటే చాలా ఇష్టం. అందుకే నా కోసమే ఎక్కువ ఆలోచిస్తుంటారు. ఈ సినిమా విషయంలో ఆమె నాకు తోడుగా నిలిచారు. ఆమె సపోర్ట్ లేకపోతే ఇక్కడి వరకు వచ్చేవాడిని కాదు.

నా ఫ్రెండ్స్ ఎక్కువగా యాక్షన్ చిత్రాలు చేయమని సలహాలు ఇస్తుంటారు. కానీ ఏ జానర్‌లో సినిమా చేసినా కూడా ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయాలన్నదే లక్ష్యం. 'పురుష:' సినిమాను ఇప్పటి వరకు చూసిన వారంతా మెచ్చుకున్నారు. కచ్చితంగా విజయం సాధిస్తుందని అన్నారు. ఈ సినిమా ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా చూడొచ్చు. పొట్టచెక్కలయ్యేలా నవ్వుకోవచ్చు. ఈ చిత్రం విడుదలైన తర్వాత తదుపరి ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తాను'' అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

Mega158: మాస్ వర్కవుట్స్‌తో మెగా158 అప్డేట్.. చిరు వీడియో వైరల్!

లేటు వయసులో ఖరీదైన 'పోర్షే' లగ్జరీ కారు.. సీనియర్ నరేశ్ జల్సానే జల్సా! ఖరీదెంతో తెలుసా?

Chiranjeevi: 'పెద్ది' ట్రైలర్ చూశా.. ఒక్కొక్కరు రఫ్ఫాడించేశారు!

Keneeshaa: 4 నెలల బిడ్డను కోల్పోయిన నేను.. జయం రవి జీవితం నాశనం చేస్తానా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy