Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
T-Rex అంటే అర్థమిదేనా శ్రీకాంత్ ఓదెల?.. చిరుని ఏం పోల్చావయ్యా

T-Rex అంటే అర్థమిదేనా శ్రీకాంత్ ఓదెల?.. చిరుని ఏం పోల్చావయ్యా

Chitrajyothy 15 hrs ago

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖుల నుంచి వెల్లువెత్తిన శుభాకాంక్షలలో 'దసరా' ఫేమ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

చిరంజీవి 'ఇంద్ర' కటౌట్‌లో తొడ కొడుతున్నట్లుగా తనని పెట్టుకుని ఫన్నీ ఎడిట్ ఫొటోను షేర్ చేస్తూ.. ''హ్యాపీ బర్త్‌డే 'T-REX' మెగాస్టార్ చిరంజీవి సర్! మన సినిమా షూటింగ్ ప్రారంభించి మీతో జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను సృష్టించుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను'' అంటూ శ్రీకాంత్ ఓదెల ట్వీట్ చేశారు. అయితే ఆయన చిరంజీవిని ఉద్దేశించి ఉపయోగించిన 'T-REX' అనే పదం వెనుక ఉన్న అసలు అర్థం ఏమిటనే దానిపై నెటిజన్లు, మెగా అభిమానులు నెట్టింట తెగ సెర్చ్ చేస్తూ చర్చించుకుంటున్నారు.

ఈ క్రమంలో ఓ నెటిజన్ 'T-Rex' పదం వెనుక ఉన్న సైంటిఫిక్ అండ్ పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్‌ను వివరిస్తూ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ''సుమారు 6.6 కోట్ల సంవత్సరాల క్రితం మెక్సికోలోని యుకటాన్ ద్వీపకల్పం వద్ద దాదాపు 10 నుంచి 15 కిలోమీటర్ల వెడల్పున్న భారీ గ్రహశకలం (Asteroid) భూమిని ఢీకొట్టింది (ప్రస్తుతం దీనిని చిక్సులూబ్ క్రేటర్ అంటారు). ఆ భారీ విధ్వంసం ధాటికి భూమిపై ఉన్న తిరుగులేని రాక్షస డైనోసార్లు మొత్తం పూర్తిగా అంతరించిపోయాయి. అలా అంతమైపోయిన డైనోసార్ జాతుల్లో అత్యంత బలమైన, క్రూరమైన అగ్ర పాలకుడినే 'టి-రెక్స్' (Tyrannosaurus Rex) అంటారు'' అంటూ ఆ నెటిజన్ వివరించారు. అంటే సినీ ప్రపంచంలో ఎవరూ ఎదురునిలవలేని అత్యంత శక్తివంతమైన ఏకైక రాజుగా చిరంజీవిని శ్రీకాంత్ పోల్చారని అభిమానులు కొనియాడుతున్నారు.

భూమి మీద డైనోసార్ల కాలంలో 'టి-రెక్స్' ఎంతటి తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించిందో, టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి కూడా నాలుగు దశాబ్దాలుగా అలాంటి సునామీని సృష్టిస్తున్నారని, అందుకే శ్రీకాంత్ ఓదెల ఆ పదాన్ని వాడారంటూ మెగా ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ''చిరంజీవి రేంజ్ ఏంటో ఒక్క పదంతో చెప్పేశావ్ కదయ్యా'' అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వీరిద్దరి కలయికలో రాబోయే భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ఏ స్థాయి విధ్వంసాన్ని సృష్టించబోతోందో.. ఈ ఒక్క ట్వీట్‌తోనే శ్రీకాంత్ శాంపిల్ చూపించారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

నందమూరి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎస్వీబీసీ ఛైర్మన్‌గా శ్రీధర్ వర్మ ప్రమాణ స్వీకారం

'జనవరి 12 విడుదల'.. అనిల్ ఇవ్వబోతోన్న స్పెషల్ సర్‌ప్రైజ్ ఏంటి?

ఐకాన్ స్టార్ 'రాకా' చుట్టూ ఇంత రహస్యం ఎందుకు?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy