Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వెంకటేష్, విజయ్‌ దేవరకొండకు లీగల్‌ నోటీసులు.. ఆ లీగ్ జరుగుతుందా?

వెంకటేష్, విజయ్‌ దేవరకొండకు లీగల్‌ నోటీసులు.. ఆ లీగ్ జరుగుతుందా?

Chitrajyothy 5 days ago

బీసీసీఐ నుంచి అనుమతి లేని టీజీ20 లీగ్‌కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), వేడుకల్లో పాల్గొంటూ ప్రాచుర్యం కలిపిస్తున్న హీరో వెంకటేష్‌ (Venkatesh)కు తెలంగాణ క్రికెట్‌ సంఘం (టీసీఏ) లీగల్‌ నోటీసులు పంపింది.

బుధవారం టీసీఏ సెక్రటరీ డి. గురువా రెడ్డి (D Guruva Reddy) విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. టీజీ20 లీగ్‌ మోసపూరితమైనది మండిపడ్డారు. ఈ అనధికార లీగ్‌లో భాగమైన ప్రతి వ్యక్తి, ప్రమోటర్‌, సంస్థ, క్రికెటర్‌ భవిష్యత్‌లో క్రిమినల్‌ కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుందని గురువారెడ్డి హెచ్చరించారు.

ఈ సందర్భంగా టీసీఏ సెక్రటరీ డి. గురువా రెడ్డి మాట్లాడుతూ.. ఈ లీగ్‌తో అనుసంధానమవుతున్న ప్రతి ఒక్కరూ ముందు హెచ్‌సీఏ (Hyderabad Cricket Association)కు బీసీసీఐ (BCCI) అనుమతి ఇచ్చిందా.. లేదా రూఢీ చేసుకోవాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేల కుమారులు ఫ్రాంచైజీ యజమానులుగా, ప్లేయర్లుగా చెలామణి అవుతూ సామాన్య, గ్రామీణ, ప్రతిభావంతులైన పేద క్రికెటర్ల పొట్ట కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌ఏ20 పేరిట అమీర్‌పేట, బేగంబజార్‌, ఎర్రగడ్డ పేరిట జట్లతో హైదరాబాద్‌ పరిధిలో లీగ్‌ చేసుకోండి కానీ జిల్లాల పేర్లతో తెలంగాణ లీగ్‌ చేసే నైతిక హక్కు హెచ్‌సీఏకు లేదని విమర్శించారు. టీజీ20 గవర్నింగ్‌ కౌన్సిల్‌ ప్రక్రియకు హెచ్‌సీఏ సభ్యుల ఆమోదం లేదని, ఏజీఎంలో కాకుండా సీఎంఓ డైరెక్షన్‌లో ఈ లీగ్‌ జరుగుతోందని ఆరోపించారు. టీజీ20 (TG20) పేరిట హెచ్‌సీఏ ఒక సర్కస్‌ను నిర్వహిస్తోందని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. మరో వైపు టీజీ20 లీగ్‌కు మద్దతు ఇస్తున్న హీరోలు వెంకటేష్, విజయ్ దేవరకొండ, హెచ్‌సీఏ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ అంబటి రాయుడు, క్రికెటర్లు తిలక్ వర్మ, మహమ్మద్ సిరాజ్‌కు లీగల్ నోటీసులు ఇవ్వనున్నట్టు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

అసలు ఇదంతా ఎందుకంటే.. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా టీజీ20 లీగ్ నిర్వహించనున్నట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి మన్నె జీవన్ రెడ్డి.. మంగళవారం మీడియా సమావేశంలో తెలిపారు. జూన్ 21 నుంచి జూలై 19 వరకు ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ లీగ్‌లో యువ క్రికెటర్లు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఈ లీగ్‌ పై ఇప్పుడు తెలంగాణ క్రికెట్ సంఘం అభ్యంతరం తెలుపుతున్న నేపథ్యంలో.. అసలీ లీగ్ జరుగుతుందా? లేదా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అలాగే ఈ వివాదాలపై వెంకీ మామ, విజయ్ ఎలా రియాక్ట్ అవుతారనేది కూడా చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

వెంకీ, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి సినిమాకు క్లాప్ ఎవరు కొట్టారంటే

Jana Nayagan: సీఎం అయినా విడుదల కాని సినిమా.. ఈసారి రెండు డేట్స్!

సోలో హీరోగా 400 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్.. ఆడు 'పెద్ది' సారొ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy