Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
China: చైనా సంచలన నిర్ణయం.. ఎన్విడియా చిప్స్‌పై నిషేధం..

China: చైనా సంచలన నిర్ణయం.. ఎన్విడియా చిప్స్‌పై నిషేధం..

RTV News 3 days ago

మెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా పర్యటన ముగించుకుని స్వదేశానికి బయలుదేరిన కొన్ని గంటల్లోనే చైనా బిగ్ షాకిచ్చింది. అమెరికన్ టెక్ దిగ్గజం ఎన్విడియాకు చెందిన ఫ్లాగ్షిప్ గేమింగ్ గ్రాఫిక్స్ కార్డ్ 'ఆర్టీఎక్స్ 5090డి వి2' (RTX 5090D V2)పై నిషేధం విధించింది.

ఈ విషయాన్ని ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు ముగించుకుని మే 15న తిరుగుపయనమయ్యారు. ఈ పర్యటనలో ట్రంప్ టీమ్లోని ఎన్విడియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెన్సన్ హువాంగ్ కూడా ఉన్నారు. ఆయన బీజింగ్లో ఉన్న సమయంలోనే చైనా కస్టమ్స్ విభాగం ఈ చిప్ను నిషేధిత వస్తువుల జాబితాలో చేర్చింది.

RBI మాస్టర్ ప్లాన్.. పుంజుకున్న రూపాయి విలువ

అమెరికా విధించిన ఎగుమతి ఆంక్షలకు తగ్గట్లు ఎన్విడియా సంస్థ తన అత్యంత శక్తివంతమైన 'RTX 5090' చిప్లో మెమొరీ, బ్యాండ్విడ్త్ను తగ్గించింది. చైనా మార్కెట్ కోసమే ప్రత్యేకంగా ఈ 'వి2' వెర్షన్ను రూపొందించింది. ప్రధానంగా చైనీస్ గేమర్స్, డిజిటల్ క్రియేటర్లను దృష్టిలో పెట్టుకొని దీన్ని తీసుకొచ్చింది. అయితే ఎన్విడియా 'బ్లాక్వెల్' ఆర్కిటెక్చర్ను కలిగి ఉండటం వల్ల చైనాలోని ఏఐ డెవలపర్లు దీన్ని తమ ఏఐ మోడల్స్ శిక్షణ కోసం ప్రత్యామ్నాయంగా వాడటం ప్రారంభించారు. అమెరికా సెమీకండక్టర్ టెక్నాలజీపై ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించుకోవాలనే వ్యూహంలో భాగంగానే చైనాకు ఈ అధునాతన గేమింగ్ చిప్ను బ్లాక్లిస్ట్లో పెట్టినట్లు నిపుణులు చెబుతున్నారు. మరోవైపు చైనాకు చెందిన టెక్ దిగ్గజం 'అలీబాబా' సరికొత్త ఏఐ ప్రాసెసర్ 'జెన్వు ఎమ్890' (Zhenwu M890)ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది.

పాక్లో కుప్పకూలిన JF-17 యుద్ధ విమానం.. ప్రాణాలతో బయటపడ్డ పైలట్లు!

ఇది తమ మునుపటి మోడల్ కన్నా మూడు రేట్లు మెరుగైన పనితీరు కనిపిస్తుందని సంస్థ ప్రకటన చేసింది. ఎన్విడియాకు చెందిన అడ్వాన్స్డ్ AI ప్రాసెసర్ 'హెచ్200' (H200) విక్రయాలకు వాషింగ్టన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ వాటి కొనుగోళ్లను చైనా ప్రభుత్వం ఆపేసింది. ఈ అనిశ్చితిని ఆసరాగా చేసుకుని అలీబాబా సరైన సమయంలో ఈ చిప్ను లాంచ్ చేసింది. ఇప్పటికే జెన్వు సిరీస్లో 5.6 లక్షలకు పైగా చిప్లను సరఫరా చేసినట్లు పేర్కొంది. అమెరికాతో సాంకేతిక యుద్ధం తీవ్రతరమవుతున్న వేళ.. ఎన్విడియా చిప్లకు చెక్ పెడుతూ హువావే, అలీబాబా లాంటి స్వదేశీ కంపెనీలను ప్రోత్సహించి సెమీకండక్టర్ రంగంలో ఆత్మనిర్భరత సాధించడమే చైనా టార్గెట్గా కనిపిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu